Side Effects of Ginger: అల్లం అతిగా తింటున్నారా? అయితే, ఈ ప్రమాదాల గురించి తప్పక తెలుసుకోండి..

Side Effects of Ginger: అల్లం వేయకుండా వంటకాలు చేసే ఇళ్లు మన దేశంలో ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తరతరాల నుంచి అల్లం వినియోగం..

Side Effects of Ginger: అల్లం అతిగా తింటున్నారా? అయితే, ఈ ప్రమాదాల గురించి తప్పక తెలుసుకోండి..
Ginger
Follow us

|

Updated on: Sep 20, 2022 | 12:36 PM

Side Effects of Ginger: అల్లం వేయకుండా వంటకాలు చేసే ఇళ్లు మన దేశంలో ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తరతరాల నుంచి అల్లం వినియోగం ప్రతీ కుటుంబంలో సర్వసాధారణం. ఎందుకంటే.. అల్లం వంటకాల రుచిని పెంచడమే కాకుండా.. ఆరోగ్య సంరక్షణిగా కూడా పని చేస్తుంది. అందుకే వంటకాలతో పాటు.. తేనీటిలోనూ అల్లంను వినియోగిస్తారు ప్రజలు. అల్లం చాయ్, మసాలా చాయ్ వంటి డ్రింక్స్ తాగుతారు. అల్లం అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. అందుకే చాలా మంది రోజూ అల్లంను నేరుగా కూడా తింటుంటారు. అయితే, ఈ అల్లంను రోజూ తిన్నా సమస్యలు వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అల్లం అతిగా తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విరేచనాలు.. అల్లం ఎక్కువ మోతాదులో తీసుకుంటే డయేరియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది ప్రేగుల ద్వారా ఆహారం, మలం ప్రవాహాన్ని వేగం చేస్తుంది. కడుపులో అలజడిని రేపుతుంది. దాంతో తీవ్రమైన అలసట, బలహీనంగా ఉంటుంది.

గర్భిణీలకు సురక్షితం కాదు.. గైనకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు 1500 mg సూచించిన పరిమితిని మించి అల్లం తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. గర్భదారణ సమయంలో సురక్షితంగా ఉండాలంటే.. అల్లం తక్కువగా తీసుకోవాలి. లేదంటే వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

రక్తస్రావం.. అల్లంలో యాంటీప్లేట్‌లెట్ గుణాలు ఉన్నాయి. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం జరగవచ్చు. లవంగం లేదా వెల్లుల్లితో కలిపి తీసుకుంటే, అది అధిక రక్తస్రావం అవుతుంది.

గుండె ఆరోగ్యంపై ప్రభావం.. రక్తపోటు సంబంధిత మందులు వాడే వారు అల్లం తీసుకోవడం మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అల్లం అధిక వినియోగం గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. హృదయ స్పందనలో అసమానతలకు దారి తీస్తుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలు.. నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటివ్ హెల్త్ ప్రకారం.. అధిక అల్లం వినియోగం గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి దుష్ప్రభావాలకు దారి తీస్తుంది. ఖాళీ కడుపుతో తినడం వలన ఇది కడుపు నొప్పికి కారణం అవుతుంది.

నోటి సమస్యలు.. అల్లంను నేరుగా తినడం వలన కొందరికి ఓరల్ అలెర్జీ కూడా వస్తుంది. దీనినే ఓరల్ అలర్జీ సిండ్రోమ్ అని అంటారు. నోట్లో దురదగా, చికాకుగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..