Health: రోజూ వ్యాయామం చేయాలా.. ఒకరోజు చేస్తే సరిపోతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే
మంచి ఆరోగ్యానికి (Health) వ్యాయామం చాలా ముఖ్యం. అయితే ప్రతిరోజూ కొంచెం వ్యాయామం చేయడం మంచిదా, లేదా వారానికి ఒకసారి వ్యాయామం చేయడం మంచిదా? అనే విషయంపై నిపుణులు సరికొత్త విషయాలను వెలుగులోకి..
మంచి ఆరోగ్యానికి (Health) వ్యాయామం చాలా ముఖ్యం. అయితే ప్రతిరోజూ కొంచెం వ్యాయామం చేయడం మంచిదా, లేదా వారానికి ఒకసారి వ్యాయామం చేయడం మంచిదా? అనే విషయంపై నిపుణులు సరికొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఒకేసారి వ్యాయామం చేయకుండా రోజూ వ్యాయామం చేయాలని గుర్తించారు. శారీరక దృఢత్వాన్ని పెంపొందించడం కోసం రెగ్యులర్ వ్యాయామం చేయడం ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో ఎక్కువ సమయం వ్యాయామం (Exercise) చేయాలని అనుకుంటారని కానీ అలా చేయడం కంటే సులభంగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. బరువైన డంబెల్‌ను రోజుకు ఆరు సార్లు నెమ్మదిగా ఎత్తినా శరీరానికి సరైనంత వ్యాయామం చేసినట్లేనని తేలింది. జపాన్ లోని నీగాటా యూనివర్సిటీ, నిషి క్యుషు యూనివర్సిటీ ఆధ్వర్యంలో నాలుగు వారాల పాటు వ్యాయామ శిక్షణపై పరిశోధనలు నిర్వహించారు. అధ్యయనంలో పాల్గొన్న వారు ఆర్మ్ రెసిస్టెన్స్ వ్యాయామాలు, కండరాల బలం చేకూర్చే వ్యాయామాలు చేశారు. కండర పుష్టి కోసం భారీ డంబెల్‌ను ఎత్తాలని సూచించారు. ఇలా నాలుగు వారాలు చేసిన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి.
వారానికి ఒకసారి ఎక్కువ వ్యాయామం చేయడం కంటే వ్యాయామాన్ని రోజువారీ చర్యగా మార్చడం చాలా ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకసారి జిమ్‌కు వెళుతుంటే, ప్రతిరోజూ ఇంట్లో కొద్దిగా వ్యాయామం చేయడం అంత ప్రభావవంతంగా ఉండదని గుర్తించారు. వారానికి ఒకసారి ఎక్కువ గంటలు వ్యాయామం చేయడం కంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా చిన్న మొత్తంలో వ్యాయామం చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం