AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పైల్స్‌తో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే మూడురోజుల్లో సమస్య పరార్..!

జీవనశైలి సరిగా లేకపోవడం, ఆహారం సరిగ్గా లేకపోవడం, నీరు తక్కువగా తాగడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఆహారంలో ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో ఎక్కువ వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది పైల్స్‌కు దారితీస్తుంది. పైల్స్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను ఎలా నయం చేసుకోవాలో తెలుసుకోండి.

పైల్స్‌తో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే మూడురోజుల్లో సమస్య పరార్..!
Say Goodbye To Piles
Jyothi Gadda
|

Updated on: Jul 10, 2025 | 9:29 PM

Share

జీవనశైలి సరిగా లేకపోవడం, ఆహారం సరిగ్గా లేకపోవడం, నీరు తక్కువగా తాగడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల పైల్స్ సమస్య వస్తుంది. ఆహారంలో ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో ఎక్కువ వ్యర్థాలు పేరుకుపోతాయి. ఇది పైల్స్‌కు దారితీస్తుంది. చల్లారిన తర్వాత మరిగించిన పాలలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మూల వ్యాధి నయమవుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 1 కప్పు మరిగించిన పాలు చల్లబడిన తర్వాత, దానిలో సగం నిమ్మకాయ రసాన్ని కలిపి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి. ఇలా 3 నుండి 7 రోజుల పాటు తాగడం వల్ల పేగు మంట నయమవుతుంది. పైల్స్ సమస్య తొలగిపోతుంది. మరికొన్ని టిప్స్‌ ఇక్కడ చూద్దాం..

మీకు పైల్స్ సమస్య ఉంటే ప్రతిరోజూ ఫైబర్ అధికంగా ఉండే కలబంద రసం తాగడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పైల్స్ ఉన్నవారు ఎక్కువ నీరు త్రాగడం చాలా ముఖ్యం. పైల్స్ తో బాధపడే వ్యక్తి రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగాలి. కలబంద చాలామంది ఇళ్లల్లో అలంకరణ కోసం పెంచుతుంటారు. అయితే ఇది మొలల సమస్యకు చెక్ పెడుతుందని మీకు తెలుసా..?

తాజా కలబంద గుజ్జు తింటూ ఉంటే ఫైల్స్ సమస్య నయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పైల్స్ సమస్యకు జీలకర్ర, సొంపు కూడా చక్కగా పనిచేస్తాయి. జీలకర్ర వేయించి పంచదారతో కలిపి మెత్తని చూర్ణంగా చేసుకోవాలి. దీన్ని 1 నుండి 2 గ్రాముల పరిమాణంలో రోజుకు 2 నుండి 3 సార్లు తినాలి.

ఇవి కూడా చదవండి

బొప్పాయి మొలల సమస్య తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రోజూ ఒక కప్పు బొప్పాయి తింటూ ఉంటే పైల్స్ సమస్య నుండి బయట పడవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..