AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వంట గదిలో ఈ రెండు పాత్రలను మర్చిపోయి కూడా తలక్రిందులుగా పెట్టకండి.. దరిద్రం పట్టుకుంటుంది..

సాధారణంగా ప్రజలు వంటగదిలో పాత్రలను కడిగిన తర్వాత తలక్రిందులుగా ఉంచుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, వంటింట్లోని రెండు పాత్రలు మాత్రం మర్చిపోయి కూడా ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచకూడదని అంటున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, ఇది ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో

Vastu Tips: వంట గదిలో ఈ రెండు పాత్రలను మర్చిపోయి కూడా తలక్రిందులుగా పెట్టకండి.. దరిద్రం పట్టుకుంటుంది..
Kitchen Vastu Tips
Jyothi Gadda
|

Updated on: Jul 07, 2025 | 9:09 PM

Share

హిందూ మతంలో వాస్తుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందులో భాగంగా ఇంటి వంటగదికి కూడా వాస్తు తప్పనిసరి. వంటిల్లు అంటే వంట చేయడానికి మాత్రమే కాదు, అన్నపూర్ణ నిలయం. లక్ష్మి నివాసం కూడా. కాబట్టి, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలంటే వంటగదికి సంబంధించిన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. వాటిని విస్మరించడం వల్ల లక్ష్మిదేవికి కోపం వస్తుంది. దాంతో ఆ ఇంటిల్లిపాది ప్రతికూల ప్రభావాలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు అంటున్నారు వాస్తు జ్యోతిశాస్త్ర నిపుణులు. అలాంటి కొన్ని వంటింటి నియమాలను ఇక్కడ తెలుసుకుందాం…

సాధారణంగా ప్రజలు వంటగదిలో పాత్రలను కడిగిన తర్వాత తలక్రిందులుగా ఉంచుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, వంటింట్లోని రెండు పాత్రలు మాత్రం మర్చిపోయి కూడా ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచకూడదని అంటున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, ఇది ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలో వంట చేసిన తర్వాత పాత్రలను కడగడం, వాటిని సరైన రీతిలో ఉంచడం చాలా ముఖ్యం. నియమాలను పాటించడం వల్ల కుటుంబ సభ్యుల పురోగతి, సంపదలో శ్రేయస్సు లభిస్తుంది. వంటింట్లోని కడాయ్, తవాను ఎప్పుడూ తలక్రిందులుగా ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలా చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

తవా తలక్రిందులుగా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, తరచుగా ఇంట్లో గొడవలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. దీనితో పాటు, ఇంట్లో పేదరికం తీష్టవేస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా ఆర్థిక పరిస్థితి కూడా క్షీణించడం ప్రారంభమవుతుంది. తవాను బోర్లగా ఉంచడం వల్ల లక్ష్మీ దేవి కోపానికి కారణమవుతారని అంటున్నారు. దాంతో ఇంట్లోని ఆనందం కరిగిపోతుంది. డబ్బు కొరతను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తవాను బోర్లాగా పెట్టకూడదని సూచిస్తున్నారు. తవాను ఎప్పుడు కడిగినా నిటారుగా ఉంచండి. దీనితో పాటు, మురికి పాత్రలను రాత్రిపూట వంటగదిలో ఉంచకూడదని కూడా గుర్తుంచుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..