హైదరాబాద్ రుచులకు ప్రపంచ గుర్తింపు.. టెస్టీ అట్లాస్ జాబితాలో భాగ్యనగరానికి దక్కిన స్థానం..
మొఘలాయి, అరబిక్, టర్కిష్, పర్షియన్ వంటకాలతో హైదరాబాద్ వంటకాలు ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాయి. దేశ విదేశాల నుండి ఇక్కడకు వచ్చే పర్యాటకులు తప్పని సరిగా మన హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ రుచి చూడకుండా ఉండలేరు. అంతలా అవి ప్రాచుర్యం పొందాయి. తాజాగా.. హైదరాబాద్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది.

భాగ్యనగరం..అదే మన హైదరాబాద్ మహా నగరం..తెలంగాణ రాజధాని. ఇది కేవలం చారిత్రక కట్టడాలు, చరిత్రకు మాత్రమే కాదు.. నోరూరించే వంటకాలకు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మొఘలాయి, అరబిక్, టర్కిష్, పర్షియన్ వంటకాలతో హైదరాబాద్ వంటకాలు ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్నాయి. దేశ విదేశాల నుండి ఇక్కడకు వచ్చే పర్యాటకులు తప్పని సరిగా మన హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇరానీ చాయ్ రుచి చూడకుండా ఉండలేరు. అంతలా అవి ప్రాచుర్యం పొందాయి. తాజాగా.. హైదరాబాద్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది.
ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ గైడ్ టెస్టీ అట్లాస్ విడుదల చేసిన లిస్ట్‌లో ప్రపంచంలో టాప్ 100 టేస్టీ నగరాల జాబితాలో హైదరాబాద్‌కు స్థానం కల్పించింది. తాజాగా విడుదల చేసిన విడుదల చేసిన జాబితాలో 50వ స్థానంలో నిలిచి భాగ్యనగరం ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు హైదరాబాద్ వంటకాల నాణ్యత, వైవిధ్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. ఇరానీ చాయ్, బిర్యానీ, హలీమ్, మిర్చీ కా సాలన్, ఉస్మానియా బిస్కెట్ వంటి ప్రత్యేక వంటకాలతో ఈ నగరం దేశ విదేశాల ఆహార ప్రియులకు స్వర్గధామంగా మారింది.
అన్ని రుచులు అందుబాటులో ఉండడం, తక్కువ ధరలు, వైవిధ్యభరిత ఆహారం ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. ఇలాంటి నగరపు ప్రత్యేక వంటకాలు టెస్టీ అట్లాస్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో నిరంతరం ప్రశంసలు అందుకుంటున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




