AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ-లండన్ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఇస్తాంబుల్‌లో అత్యవసర ల్యాండింగ్..

టర్కీలోని ఇస్తాంబుల్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి వెళ్తున్న విమానంలో విమానం వ్యవస్థలో సమస్య ఉందని ఎయిర్ లైన్స్ గుర్తించిన తర్వాత ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది. ఈ కారణంగా ప్రయణికులు..

ఢిల్లీ-లండన్ ఫ్లైట్‌లో సాంకేతిక లోపం.. ఇస్తాంబుల్‌లో అత్యవసర ల్యాండింగ్..
Delhi London Flight
Jyothi Gadda
|

Updated on: Jul 07, 2025 | 7:14 PM

Share

న్యూఢిల్లీ నుండి లండన్ కు వెళ్తున్న వర్జిన్ అట్లాంటిక్ నడుపుతున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. న్యూఢిల్లీ నుండి నేరుగా లండన్‌కు ప్రయాణీకులను తీసుకెళ్లాల్సిన VS301 విమానం మధ్యలో ఇబ్బందులను ఎదుర్కొంది. టర్కీలోని ఇస్తాంబుల్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. లండన్ లోని హీత్రూ విమానాశ్రయానికి వెళ్తున్న విమానంలో విమానం వ్యవస్థలో సమస్య ఉందని ఎయిర్ లైన్స్ గుర్తించిన తర్వాత ఇస్తాంబుల్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని విమానయాన సంస్థ వెల్లడించింది.

విమానంలో చిన్న సాంకేతిక సమస్య ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్య తీసుకున్నట్లు ఎయిర్‌లైన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన తర్వాత ఇస్తాంబుల్ విమానాశ్రయంలో చాలా గంటలు వేచి ఉండాల్సి వచ్చిందని ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. విమానం సురక్షితంగా టర్కిష్ గడ్డపై దిగిన తర్వాత, ప్రయాణీకులందరినీ ఖాళీ చేయించి, నియమించబడిన వేయింటింగ్‌ హాల్‌ ప్రాంతానికి తరలించారు. అక్కడ వారికి పరిస్థితి గురించి వివరంగా తెలియజేశారు. వారందరినీ లండన్‌కు సురక్షితంగా చేర్చేందుకు గానూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు.

అత్యవసర ల్యాండింగ్‌కు దారితీసిన సాంకేతిక సమస్య వల్ల ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి హాని కలిగించలేదని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. ఆలస్యం కారణంగా చాలా మందికి అసౌకర్యాన్ని కలిగించినప్పటికీ, ప్రయాణికుల క్షేమం ముఖ్యం కాబట్టి, అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..