Health Tips: ఎప్పుడూ చిరాకు పడుతుంటారా? ఈ ఆహారాలు మీలో ప్రశాంతతను పెంచుతాయి..!
మానసిక స్థితి స్వంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఉల్లాసంగా ఉంటే, ఆఫీసులో లేదా వ్యక్తిగత జీవితంలో అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. అదే కోపంగా, చిరాకుగా ఉంటుంటే.. అలాంటి వారికి ప్రజలు ఎప్పుడూ దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని సమస్యల కారణంగా కొన్నిసార్లు మీ మానసిక స్థితి చెడిపోవచ్చు. అయితే, ఈ సమస్య ఇలాగే కొనసాగితే ఇబ్బందులు ఎదురవుతాయయి.

Healthy Lifestyle: మానసిక స్థితి స్వంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా.. చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు, మీరు ఉల్లాసంగా ఉంటే, ఆఫీసులో లేదా వ్యక్తిగత జీవితంలో అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. అదే కోపంగా, చిరాకుగా ఉంటుంటే.. అలాంటి వారికి ప్రజలు ఎప్పుడూ దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కొన్ని సమస్యల కారణంగా కొన్నిసార్లు మీ మానసిక స్థితి చెడిపోవచ్చు. అయితే, ఈ సమస్య ఇలాగే కొనసాగితే ఇబ్బందులు ఎదురవుతాయయి. అందుకే మీ మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం మీ దినచర్యను మెరుగుపరుచుకోవాలి. అలాగే కొన్ని ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మానసికంగా ప్రయోజనం ఉంటుంది.
వాస్తవానికి, మన మానసిక స్థితి అనేది హార్మోన్లకు సంబంధించినది. మనం ఏదైనా ఇష్టమైన యాక్టివిటీ వంటి పాటలను విన్నప్పుడు, డోపమైన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొన్ని ఆహారాలు తినడం వల్ల సెరోటోనిన్ పెరుగుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఏయే ఆహారాలు మీ మూడ్‌ని రిఫ్రెష్‌గా ఉంచుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డార్క్ చాక్లెట్..
శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను ప్రోత్సహించాలనుకుంటే, డార్క్ చాక్లెట్ మంచి ఎంపిక. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు మీ మూడ్‌ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అయితే, పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి.
గింజలు, విత్తనాలు..
ఆహారంలో బాదం, వేరుశెనగ, వాల్‌నట్‌లు, పొద్దుతిరుగుడు గింజలు, నువ్వులు, గుమ్మడి గింజలు వంటి గింజలను చేర్చుకోవాలి. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే.. ఈ గింజలు విత్తనాలు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
పాలకూర..
మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలతో కూడిన పాలకూరను మీ ఆహారంలో చేర్చండి. కొన్నిసార్లు మెగ్నీషియం లోపం కూడా ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలను కలిగిస్తుంది. బచ్చలికూర సెరోటోనిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది కాకుండా, ఆకుపచ్చ కూరగాయలు కూడా మానసిక స్థితిని చక్కగా ఉంచడంలో సహాయపడతాయి.
ఆపిల్..
యాపిల్ గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు నిపుణులు. అలాగే.. ఇది మీ మానసిక స్థితిని కూడా చక్కగా ఉంచడంలో సహాయపడుతుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆపిల్‌ను ఆహారంలో చేర్చుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..