Diabetes Diet: మీకు డయాబెటీస్ ఉందా..? అయితే ఈ ఆహారాలను తప్పక తినండి.. ఆపై షుగర్ లెవెల్స్ మీ కంట్రోల్‌లోనే..!
Diabetes Diet: షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా శరీరానికి కావాల్సిన పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవాలి. అలాగే షుగర్ లెవల్స్‌ను తగ్గించే లక్షణాలు ఉన్న ఆహారాలను కూడా తినాలి. మరి ఇందు కోసం డయాబెటిస్ రోగులు ఏయే రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Diabetes Diet: మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇలా పెరుగుతున్న సమస్యలో డయాబెటిస్ కేసులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. డయాబెటీస్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. లేదంటే శరీరంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగి ప్రాణాంతక స్థితికి దారితీస్తాయి. ఈ క్రమంలో షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇంకా శరీరానికి కావాల్సిన పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవాలి. అలాగే షుగర్ లెవల్స్‌ను తగ్గించే లక్షణాలు ఉన్న ఆహారాలను కూడా తినాలి. మరి ఇందు కోసం డయాబెటిస్ రోగులు ఏయే రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బీట్రూట్: షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసేందుకు డయాబెటీస్ ఉన్నవారు బీట్రూట్లను తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోన్యూట్రియెంట్స్ వంటి పోషకాలను పుష్కలంగా కలిగిన బీట్రూట్ డయాబెటీస్ నియంత్రణలో సహయపడుతాయి. అలాగే ఇందులో నేచురల్ షుగర్ ఉన్నప్పటికీ అది శరీరంలో త్వరగా గ్లోకోజ్ మార్చబడదు. కాబట్టి బీట్రూట్లను డయాబెటీస్ఉ న్నవారు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేసేందుకు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
టమోటాలు: విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియంతో పాటు లైకోపీన్‌ని అధికంగా కలిగిన టమోటాలు రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారికి కలిగే గుండె సమస్యల ప్రమాదాన్నితగ్గిస్తాయి. పైగా ఇందులో కార్బ్, కేలరీలు కూడా తక్కువగా ఉన్నందున ఇవి డయాబెటిస్ ఉన్నవారికి మేలు చేస్తాయి.
గుమ్మడికాయ గింజలు: ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ , ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలను కలిగిన గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే ఇవి షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో డయాబెటిస్ రోగులకు సహాయపడతాయి.
నేరేడు పండ్లు: మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్‌ను తగ్గించుకునేందుకు నేరేడు పండ్లు ఉత్తమ ఆహారం. నేరేడులోని పోషకాలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఆయుర్వేదంలో నేరేడు పండ్ల పొడిని కూడా రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు ఉపయోగిస్తుంటారు.
మెంతి గింజలు: మెంతి గింజలు అలాగే మెంతి ఆకులు, రెండూ షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉన్నందున ఇవి జీర్ణ సమస్యలను నివారంచి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..