AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Care: షుగర్ లెవల్స్ భారీగా పెరుగుతున్నాయా? ఇది ప్రతి రోజూ ఒక్కటి తీసుకుంటే ప్రయోజనాలు అమోఘం..

ప్రస్తుత బిజీ ప్రపంచంలో నానాటికి మధుమేహ బాధితుల సంఖ్య జెట్ స్పీడ్‌లో పెరుగుతోంది. ఒక్కసారి మధుమేహం భారిన పడితే అంతే సంగతి.

Health Care: షుగర్ లెవల్స్ భారీగా పెరుగుతున్నాయా? ఇది ప్రతి రోజూ ఒక్కటి తీసుకుంటే ప్రయోజనాలు అమోఘం..
Cucumber Benefits
Shiva Prajapati
|

Updated on: Oct 26, 2022 | 7:09 PM

Share

ప్రస్తుత బిజీ ప్రపంచంలో నానాటికి మధుమేహ బాధితుల సంఖ్య జెట్ స్పీడ్‌లో పెరుగుతోంది. ఒక్కసారి మధుమేహం భారిన పడితే అంతే సంగతి. జీవితాంతం మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. అలాగే, తినే ఆహారంపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేదంటే.. ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడం చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర సకాలంలో నియంత్రించకపోతే, అది ఇతర వ్యాధులకు కారణం అవుతుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు మెడిసిన్స్‌తో పాటు.. మనం తినే ఆహారం కూడా దోహదపడుతుంది. వాటిల్లో ముఖ్యంగా దోసకాయను ప్రధానంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దోసకాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బ్లడ్ షుగర్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చునని చెబుతున్నారు. అంతేకాదు.. దోసకాయతో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దోసకాయం తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. వాస్తవానికి ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిని తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అందుకే రోజూ ఒక దోసకాయను తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దోసకాయను ఎలా తీసుకోవచ్చంటే..

దోసకాయ సూప్..

మధుమేహం నుంచి ఉపశమనం పొందడానికి దోసకాయను అనేక విధాలుగా ఆహారంలో చేర్చుకోవచ్చు. డయాబెటిస్ నుంచి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటే ప్రతీరోజూ దోసకాయ సూప్ తీసుకోవాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

దోసకాయ సూప్ ఎలా తయారు చేయాలి..

దోసకాయ సూప్‌ తయారు చేయడానికి ఒక దోసకాయ సరిపోతుంది. ఇందుకోసం దోసకాయను కట్ చేయాలి. ఆ తరువాత 3 టీ స్పూన్ల నిమ్మరసం, 1 చిన్న ఉల్లిపాయ, 1 వెల్లుల్లి రెబ్బ, 1/4 ఆలీవ్ నూనె, 1/2 కప్పు కొత్తిమీర, ఒక టీస్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు, మిరియాల పొడి కలపాలి. ఈ పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మిక్స్ చేయాలి. ఆ తరువాత మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనిని సూప్‌గా తీసుకోవచ్చు. దీని వల్ల షుగర్ తగ్గడమే కాకుండా, వేగంగా బరువు కూడా తగ్గుతారు.

సలాడ్‌గా కూడా తినొచ్చు..

దోసకాయను అనేక రకాలుగా తినొచ్చు. దోసకాయ సూప్ చేసుకునే సమయం లేకపోతే.. దానిని సలాడ్ రూపంలోనూ తినొచ్చు. డయాబెటిస్ పేషెంట్ అయితే, రోజూ ఒక దోసకాయ తినేందుకు ప్రయత్నించాలిన సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..