Vitamin P: విటమిన్ పి అంటే ఏమిటి.. దీని లోపాన్ని భర్తీ చేయడానికి ఈ ఆహారాలు తినండి..
విటమిన్ p గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సమతులాహారం ద్వారా విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. శరీరంలో ఏదైనా విటమిన్ లోపం ఉంటే, అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే, మీరు ఇప్పటి వరకు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి గురించి తప్పక వినే ఉంటారు. మరి 'విటమిన్ పి' గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విటమిన్ లోపం వల్ల కలిగే సమస్యలు, దాని ప్రయోజనాలు ఏమిటి? మీ ఆహారంలో ఏ ఆహారాలను చేర్చడం ద్వారా మీరు ఈ విటమిన్..

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి, ఆహారంలో విటమిన్లు ఉండటం చాలా ముఖ్యం. మీరు ఇప్పటి వరకు చాలా విటమిన్ల పేరు విని ఉంటారు. కానీ, విటమిన్ p గురించి మీకు తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్, ఆరోగ్యంగా ఉండేందుకు విటమిన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సమతులాహారం ద్వారా విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. శరీరంలో ఏదైనా విటమిన్ లోపం ఉంటే, అది మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే, మీరు ఇప్పటి వరకు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి గురించి తప్పక వినే ఉంటారు. మరి ‘విటమిన్ పి’ గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ విటమిన్ లోపం వల్ల కలిగే సమస్యలు, దాని ప్రయోజనాలు ఏమిటి? మీ ఆహారంలో ఏ ఆహారాలను చేర్చడం ద్వారా మీరు ఈ విటమిన్ లోపాన్ని తీర్చవచ్చు? కీలక వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
నిజానికి ‘విటమిన్ పి’ ని ఒక రకమైన ఫ్లేవనాయిడ్స్ అంటారు. ఇందులో ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని లోపం వల్ల అనేక రకాల వ్యాధులు శరీరంలో వ్యాప్తి చెందుతాయి. ఈ కారణంగానే మీ డైట్‌లో కొన్ని ఆహారాలను చేర్చడం ద్వారా.. ఆ లోపాన్ని భర్తీ చేయొచ్చు. మరి ఆ పదార్థాలేంటో ఇక్కడ చూడండి.
సిట్రస్ ఫ్రూట్స్: ‘విటమిన్ పి’ లోపాన్ని సరి చేయడానికి సిట్రస్ పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. నారింజ, ద్రాక్షపండు, నిమ్మ వంటి పండ్లలో ఫ్లేవనాయిడ్లు అధిక మొత్తంలో ఉంటాయి.
గ్రీన్ టీ: క్యాటెచిన్ గ్రీన్ టీలో ఉంటుంది. ఇది ఒక రకమైన ఫ్లేవనాయిడ్. ఇది బరువు తగ్గడం నుండి అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. విటమిన్ పి లోపాన్ని తీర్చడానికి రోజువారీ దినచర్యలో గ్రీన్ టీని చేర్చుకోవచ్చు.
కూరగాయలు: బచ్చలికూర, బ్రోకలీ వంటి కూరగాయలలో కూడా ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అదే సమయంలో, ఈ కూరగాయలను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పండ్లు: విటమిన్ పి లోపాన్ని తీర్చాలనుకుంటే.. బ్లూబెర్రీ, కోరిందకాయ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ మొదలైన వాటిని మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. ఆపిల్ కూడా మంచి ఆప్షన్.
డార్క్ చాక్లెట్: చాక్లెట్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ అందరూ డార్క్ చాక్లెట్ తినరు. డార్క్ చాక్లెట్‌లో కాటెచిన్స్, ప్రోసైనిడిన్‌లు ఉంటాయి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న, నిపుణులు అందించిన సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




