Health Tips: రన్నింగ్ ప్రారంభించాలనుకుంటున్నారా? అంతకంటే ముందు ఈ 10 పరీక్షలు చేయించుకోండి..
Health Tips: కండరాలను బలోపేతం చేయడానికి, హృదయనాళాల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడానికి, కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి జాగింగ్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇంతకాలం ఇంటికే పరిమితమై.. ఇప్పుడు రన్నింగ్, జాగింగ్ చేయాలని భావిస్తున్నారా?
Health Tips: కండరాలను బలోపేతం చేయడానికి, హృదయనాళాల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడానికి, కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి జాగింగ్ ఒక అద్భుతమైన ఎంపిక. ఇంతకాలం ఇంటికే పరిమితమై.. ఇప్పుడు రన్నింగ్, జాగింగ్ చేయాలని భావిస్తున్నారా? అయితే, పరుగెత్తడానికి లేదా ఏదైనా ఇతర వ్యాయామం చేయడానికి ముందు మీరు తప్పనిసరిగా 10 పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుత కాలంలో యువకులే కాదు వృద్ధులు, అన్ని వయసుల వారు ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. వ్యాయామం చేయాలనుకుంటే.. జాగింగ్, రన్నింగ్‌తో ప్రారంభించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రన్నింగ్ మన శరీరంలోని అన్ని భాగాలకు వ్యాయామాన్ని అందిస్తుంది. అందుకే చాలా చోట్ల క్లబ్బులు నడుస్తున్నాయి. రన్నింగ్, జాగింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, మీరు రన్నింగ్ ప్రారంభించే ముందు.. కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. మరి ఆ పరీక్షలేంటో ఓసారి చూద్దాం..
రన్నింగ్ చేయడం వల్ల ఎముకలు బలపడతాయి. కండరాలను బలోపేతం చేయడానికి, హృదయనాళాల ఫిట్‌నెస్‌ను మెరుగుపరచడానికి, కేలరీలను తగ్గించడానికి, బరువు తగ్గడానికి జాగింగ్ ఒక అద్భుతమైన ఎంపిక. జిమ్‌లో చెమట పట్టించే బదులు రోజుకు కేవలం 30 నిమిషాలు పరుగెత్తడం వల్ల మీ ఆరోగ్యం మెరుగువుతుంది. శరీరంలోనూ మార్పులు వస్తాయి. అయితే, పరుగెత్తడం గానీ, ఇతర ఇతర వ్యాయామం చేస్తే మాత్రం దానికంటే ముందు10 పరీక్షలు చేయించాల్సి ఉంటుంది.
ఈ మధ్య కాంలో చాలా మంది జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు కుప్పకూలిపోవడం, జాగింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడం వంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని చూసే వాళ్లు శారీరక వ్యాయామాలు చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే.. రన్నింగ్, వ్యాయామాల సమయంలో గుండెపోటు సంఘటనలు సాధారణంగా ముందుగా ఉన్న గుండె జబ్బులు, ప్రమాద కారకాలకు సంబంధించినవి. ఈ జబ్బులపై బాధిత వ్యక్తులకు సమాచారం లేకపోవడం వల్ల ప్రాణాంతకంగా మారుతుంది. ఫలితంగా వ్యాయమం చేసే సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మీరు ఎవరైనా వ్యాయామం, రన్నింగ్ ప్రారంభించినట్లయితే.. కొన్ని పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆ పరీక్షలేంటంటే..
1. రక్తపోటు: ఇంట్లోనే బిపి మెషీన్‌తో సులభంగా చెక్ చేసుకోవచ్చు. రక్తపోటు 130/80 mmHg కంటే తక్కువగా ఉండాలి.
2. బ్లడ్ షుగర్ లెవెల్: తినే ముందు మీ బ్లడ్ షుగర్ లెవెల్ 100 mg/dL కంటే తక్కువగా ఉండాలి.
3. గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ (HbA1C): 5.6% వరకు సాధారణమైనదిగా పరిగణించబడుతుంది.
4. లిపిడ్ ప్రొఫైల్: 50 కంటే ఎక్కువ HDL, 100 కంటే తక్కువ LDL, 150 కంటే తక్కువ ట్రైగ్లిజరైడ్స్ మరియు మొత్తం కొలెస్ట్రాల్ 200 కంటే తక్కువ. ట్రైగ్లిజరైడ్/HDL నిష్పత్తి 1 లేదా అంతకంటే తక్కువ ఉంటే చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది.
5. ECG: అసాధారణ గుండె లయను గుర్తించడంలో ఉపయోగపడుతుంది.
6. ఎఖోకార్డియోగ్రామ్: హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి (HOCM) నిర్ధారణలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, ఇది యువ క్రీడాకారులలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు సాధారణ కారణం.
7. హోమోసిస్టీన్: 15 కంటే ఎక్కువ స్థాయిలు గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.
8. విటమిన్ డి: విటమిన్ డి లోపం ప్రతి ఒక్కరిలో సాధారణం. ఇది ఎముక పగుళ్లు మొదలైన వాటి ప్రమాదాన్ని పెంచుతుంది.
9. విటమిన్ బి12: ఈ లోపం ముఖ్యంగా శాకాహారులలో ఎక్కువగా కనిపిస్తుంది.
10. హిమోగ్లోబిన్: తక్కువ హిమోగ్లోబిన్ (రక్తహీనత) వ్యాయామం సమయంలో మీ పనితీరును తగ్గిస్తుంది.
మరిన్ని ఆరోగ్య వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..