AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచే ఈ డ్రింక్స్‌ తప్పక తాగాలి..!

కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. తక్కువ లక్షణాలతో బాధపడుతున్న వారికి కోలుకోవడానికి 2-3 వారాలు పట్టవచ్చు. మందులతో పాటు, కొన్ని ఆహార మార్పులు డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి మీకు సహాయపడతాయి. ఇది శరీరంలో కోల్పోయిన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. డెంగ్యూ జ్వరం నుంచి కోలుకుంటున్న వారు పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.

డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచే ఈ డ్రింక్స్‌ తప్పక తాగాలి..!
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2023 | 7:39 AM

Share

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ జ్వరాల వ్యాప్తి పెరిగింది. తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కోల్‌కతా సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. వర్షాకాలం తర్వాత ప్రతి సంవత్సరం ఈ డెంగ్యూ వ్యాధి చాలా మందిని ఎటాక్‌ చేస్తుంది. కాబట్టి, వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. డెంగ్యూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా సోకిన ఈడిస్ దోమల కాటు ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. గత నెల,రెండు నెలలుగా ప్రజల్లో మలేరియా, లెప్టోస్పిరోసిస్, కామెర్లు వంటి కేసులు పెరుగుతున్నాయి. వీటి లక్షణాలు జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల నొప్పులు,విరేచనాలు, వాంతులు, దగ్గు, వాసన, రుచి లేదా గొంతు నొప్పి వంటి అదనపు లక్షణాలు చాలా మందిని బాధిస్తున్నాయి.

అయితే, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధి సంక్రమణ తీవ్రంగా వ్యాపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. తక్కువ లక్షణాలతో బాధపడుతున్న వారికి కోలుకోవడానికి 2-3 వారాలు పట్టవచ్చు. మందులతో పాటు, కొన్ని ఆహార మార్పులు డెంగ్యూ నుండి త్వరగా కోలుకోవడానికి మీకు సహాయపడతాయి. ఇది శరీరంలో కోల్పోయిన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. డెంగ్యూ జ్వరం నుంచి కోలుకుంటున్న వారు పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, హైడ్రేటెడ్ గా ఉండటం కూడా ముఖ్యం.

నీరు: డెంగ్యూ జ్వరం నుండి కోలుకుంటున్నప్పుడు బాగా హైడ్రేటెడ్ గా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ వ్యాధి అధిక జ్వరం, వాంతులు, విరేచనాల కారణంగా డి హైడ్రేషన్‌కి గురవుతారు. ప్రతిరోజూ కనీసం 6-8 గ్లాసుల నీరు తాగటం తప్పనిసరి. మంచినీళ్లు, ఎలక్ట్రోలైట్స్ హైడ్రేషన్ మెయింటెయిన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది కడుపుకు చలువ చేస్తుంది. వికారం, వాంతులు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

పసుపు: పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. పసుపును గోరువెచ్చని పాలలో కలిపి తాగడం వల్ల కూడా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పండ్ల రసాలు: ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. నారింజ, నిమ్మ, బొప్పాయి వంటి విటమిన్ సి అధికంగా ఉన్న పండ్ల రసాలు మీ రోగనిరోధక వ్యవస్థకు మద్దతునిస్తాయి.

అలోవెరా జ్యూస్: శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్న కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణ రుగ్మతలు తగ్గుతాయి. శరీరంలో మంట తగ్గుతుంది.

డెంగ్యూ తీవ్రమైన అనారోగ్యం అని గుర్తుంచుకోండి. మందులతో పాటు, లక్షణాలను తగ్గించడానికి, కోలుకోవడానికి మీకు సహాయపడే ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం.

Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే