Health Tips: వ్యాయామం తరువాత తీవ్రమైన దురదగా ఉందా? ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేయండి..

ఆరోగ్యం కోసం మనందరం ఉదయం గానీ, సాయంత్రం గానీ రన్నింగ్, వ్యాయామం చేస్తుంటాం. చెమటలు కక్కేలా కష్టపడుతుంటాం. ఇదంతా మంచి ఆరోగ్యం కోసం.

Health Tips: వ్యాయామం తరువాత తీవ్రమైన దురదగా ఉందా? ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇలా చేయండి..
Bumps
Follow us

|

Updated on: Mar 02, 2023 | 1:12 PM

ఆరోగ్యం కోసం మనందరం ఉదయం గానీ, సాయంత్రం గానీ రన్నింగ్, వ్యాయామం చేస్తుంటాం. చెమటలు కక్కేలా కష్టపడుతుంటాం. ఇదంతా మంచి ఆరోగ్యం కోసం. కానీ, ఆరోగ్యం కోసం చేసే వ్యాయామమే.. అనారోగ్యానికి కారణం అయితే? అవును, తాజాగా హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీక్ కుమార్.. ఓ విచిత్రమైన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వ్యాయామం చేయడం ద్వారా ఒళ్లంతా దురద వస్తుంది. దానికి కారణం ఒకరకమైన బ్యాక్టీరియా అని చెబుతున్నారు డాక్టర్ సుధీర్.

ఒక వ్యక్తికి రన్నింగ్ చేసిన తరువాత శరీరం అంతా కొంచెం దురద వచ్చింది. ఇది ఒక గంట కంటే ఎక్కువ సమయమే ఉంది. దాంతో సదరు వ్యక్తి.. వైద్యులను సంప్రదించగా ఎవరో కారణం చెప్పలేకపోయారు. చివరి ప్రయత్నంగా బాధిత వ్యక్తి డాక్టర్ సుధీర్‌ను సంప్రదించాడు. సుధీర్.. ఈ దురదకు కారణాన్ని తెలిపారు. ఈ దురదకు కారణం.. వ్యాయామ ప్రేరేపిత ఉర్టికేరియాగా పేర్కొన్నారు డాక్టర్ సుధీర్ కుమార్. ఇది ఒక అసాధారణ పరిస్థితి అని తెలిపారాయన.

వ్యాయామం ప్రేరిత ఉర్టికేరియా అంటే ఏంటి?

వ్యాయామం-ప్రేరిత ఉర్టికేరియా అనేది శారీరక శ్రమ సమయంలో లేదా తర్వాత ప్రజలు అలెర్జీ సమస్యలను ఎదుర్కొంటారు. దీని కారణంగా శరీరంలో చర్మంపై పెద్ద దద్దుర్లు, గడ్డలుగా కనిపిస్తుంది. ఎర్రటి మచ్చలు, బొబ్బలుగా వస్తుంది.

ఇవి కూడా చదవండి

కారణమిదేనట..

వ్యాయమ సమయంలో శరీరంలో వేడి పెరగడం, శరీర భాగాలకు రక్త సరఫరా పెరగడం వల్ల ఉర్టికేరియాకు కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. చెమట, వ్యాయామానికి ముందు తినే నిర్దిష్ట ఆహారం, షవర్ జెల్, సబ్బు కూడా దీనికి కారణం అవుతుందంటున్నారు.

ఉర్టికేరియా యొక్క సాధారణ లక్షణాలు:

1. చర్మంపై దురద.

2. చర్మంపై ఎరుపు మచ్చలు.

3. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.

4. పొత్తికడుపులో తిమ్మిరి.

5. ముఖం, నాలుక, చేతులు వాపు.

6. తలనొప్పి.

ఇలాంటి లక్షణాలను గమనించినట్లయితే.. వెంటనే వ్యాయామం చేయడం మానేయాలని.. 5 నుండి 10 నిమిషాల తర్వాత కూడా ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..