Amla Benefits: చలి కాలంలో ఉసిరి కాయ ఎందుకు తినాలి.. తింటే ఏం జరుగుతుంది!

చలి కాలంలో లభ్యమయ్యే వాటిల్లో ఉసిరి కాయ కూడా ఒకటి. ఉసిరి కాయ ఒక ఔషధ గని. ఆయుర్వేదంలో ఉసిరిని వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. దీని టేస్ట్ పుల్లగా, వగరుగా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి, అలాగే రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. అలాగే క్యాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ వంటి గుణాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా చలి కాలంలో వచ్చే..

Amla Benefits: చలి కాలంలో ఉసిరి కాయ ఎందుకు తినాలి.. తింటే ఏం జరుగుతుంది!
ఆహారం తిన్న త‌ర్వాత ఉసిరిని తింటే జీర్ణ సంబంధ‌మైన స‌మస్య‌లు దూర‌మ‌వుతాయి. ఉసిరిలో అధిక శాతంలో ఏ-విట‌మిన్ కూడా ఉండ‌టం వ‌ల్ల క‌ళ్ల‌కు మేలు జ‌రుగుతుంది. రోజుకి 20 మిల్లిలీటర్ల ఆమ్లా జ్యూస్ లేదా 1-2 టేబుల్ స్పూన్ల ఎండు ఉసిరిని తీసుకోవ‌చ్చు. ముఖ్యంగా పిల్ల‌ల చేత ఉసిరిని తినిపించ‌డం వ‌ల్ల చ‌లికాలంలో వ‌చ్చే జ‌లుబు, ద‌గ్గు లాంటి స‌మ‌స్య‌లు రాకుండా నివారించ‌వ‌చ్చు.
Follow us

|

Updated on: Nov 13, 2023 | 7:50 PM

చలి కాలంలో లభ్యమయ్యే వాటిల్లో ఉసిరి కాయ కూడా ఒకటి. ఉసిరి కాయ ఒక ఔషధ గని. ఆయుర్వేదంలో ఉసిరిని వివిధ అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. దీని టేస్ట్ పుల్లగా, వగరుగా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి, అలాగే రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. అలాగే క్యాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ వంటి గుణాలు ఉంటాయి. ఇవి ముఖ్యంగా చలి కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతే కాకుండా ఉసిరి కాయ తినడం వల్ల ఎముకలు బలంగా, స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇంకా ఉసిరి కాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కంటి చూపును మెరుగు పరుస్తుంది:

ఉసిరి కాయను తినడం వల్ల కంటి చూపుకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగు పడుతుంది. కళ్లు ఎర్ర బడటం, దురదని కూడా తగ్గిస్తుంది. ఉసిరి రసాన్ని ప్రతి రోజూ ఉదయం ఓ గ్లాస్ నీటిలో కలుపుకుని తాగినా లేదా నేరుగా తాగినా కళ్లకు చాలా మంచింది.

ఇవి కూడా చదవండి

చర్మ సమస్యలు తగ్గుతాయి:

చర్మ సమస్యల్ని తగ్గించడంలో కూడా ఉసిరి కాయ బాగా హెల్ప్ చేస్తుంది. ఉసిరి కాయ రసాన్ని తరచూ తాగితే.. చర్మంపై ఉండే దద్దుర్లు, అలర్జీ, ముడతలు, మచ్చలు రాకుండా చూస్తుంది. అంతే కాకుండా స్కిన్ ని సాఫ్ట్ గా చేయడంలో సహాయ పడుతుంది. ఇందులో లుండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ కారణంగా చర్మ కాణలు దెబ్బ తినకుండా ఉంటాయి.

జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది:

జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఉసిరి బాగా ఉపయోగ పడుతుంది. కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి:

ఉసిరి కాయతో తయారు చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి రాకుండా అడ్డు పడుతుంది. ఉసిరి కాయతో కలిపి తేనె తీసుకుంటో ఇంకా ఎఫెక్టీవ్ గా పని చేస్తుంది.

బరువు తగ్గుతారు:

అధిక బరువుతో ఇబ్బంది పడే వారికి ఉసిరి కాయ బాగా సహాయ పడుతుంది. ఉసిరిలో ఉండే ఫైబర్.. త్వరగా ఆకలి వేయకుండా చూస్తుంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారు ఉసిరి తీసుకుంటే మంచి ప్రయోజనాలు అందుతాయి.

బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది:

జ్ఞాపక శక్తిని పెంచడంలో ఉసిరి కాయ అద్భుతంగా పని చేస్తుంది. మెదడు యాక్టీవ్ గా చేసి ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా మూత్ర పిండాల సంబంధిత వ్యాధులు, గుండె ఆరోగ్యంగా పని చేశాలా చేస్తుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు