- Telugu News Photo Gallery Winter Skin Care Tips: Common Winter Skin Issues And Ways To Solve Them Naturally
Winter Skin Care: రాత్రి పడుకునే ముందు కాస్తింత వెన్న పెదాలకు రాస్తే.. శీతాలకాలంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
శీతాకాలంలో చర్మ సంరక్షణకు కాస్త శ్రద్ధ వహించాలి. లేదంటే చర్మం పొడిబారి, గరుకుగా మారుతుంది. అందుకే స్నానం చేసిన ప్రతిసారీ బాడీ లోషన్ రాసుకోవాలి. నిజానికి చలికాలం వచ్చిందంటే వేలకొద్దీ చర్మ సమస్యలు పొంచి ఉంటాయి. చల్లని వాతావరణంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ పొడి చర్మంతో బాధపడుతుంటారు. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌తోపాటు ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పొడి చర్మంతోపాటు
Updated on: Nov 13, 2023 | 7:48 PM

శీతాకాలంలో చర్మ సంరక్షణకు కాస్త శ్రద్ధ వహించాలి. లేదంటే చర్మం పొడిబారి, గరుకుగా మారుతుంది. అందుకే స్నానం చేసిన ప్రతిసారీ బాడీ లోషన్ రాసుకోవాలి. నిజానికి చలికాలం వచ్చిందంటే వేలకొద్దీ చర్మ సమస్యలు పొంచి ఉంటాయి.

చల్లని వాతావరణంలో చర్మం త్వరగా పొడిబారుతుంది. చలికాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ పొడి చర్మంతో బాధపడుతుంటారు. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్‌తోపాటు ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పొడి చర్మంతోపాటు దురద, దద్దుర్లు, పగిలిన పెదవులు, కాళ్ల మడమల పగుళ్లు వంటి సమస్యలు ఈ కాలంలో పొంచి ఉంటాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా హైడ్రేటింగ్ కోసం మాయిశ్చరైజింగ్‌ను ఉపయోగించాలి. ఇది పొడి చర్మం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

డ్రై స్కిన్ రాష్‌తో బాధపడేవారికి పసుపు సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి పొడి చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి. తేనెతో పసుపు కలిపి వారానికి ఒకసారి ముఖానికి రాసుకోవచ్చు.

శీతాకాలంలో సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే చర్మం పాడైపోతుంది. కాబట్టి చలికాలంలో కూడా సన్‌స్క్రీన్ లేకుండా బయటకు వెళ్లకూడదు. సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం వల్ల చర్మం వృద్ధాప్య ఛాయలను నివారించవచ్చు. చలికాలంలో చర్మం మెరుపును కోల్పోతుంది. కోల్డ్ క్రీమ్ వాడటం వల్ల చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే చర్మం ఉపరితలంపై మృతకణాలు పేరుకుపోతాయి. ఓట్స్‌లో పాలను మిక్స్ చేసి స్క్రబ్ తయారు చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

పొడి వాతావరణంలో పెదవులు పగిలిపోతే ప్రతిరోజూ లిప్ బామ్ ఉపయోగించడం మర్చిపోకండి. లిప్ బామ్ పెదాలను తేమగా ఉంచుతుంది. అలాగే రాత్రిపూట పెదవులపై నెయ్యి రాసుకుని నిద్రపోవచ్చు.





























