- Telugu News Photo Gallery Business photos Here are the top five two wheelers showcased at EICMA that could be launched in India soon, check list
EICMA 2023: మార్కెట్‌ను షేక్ చేయనున్న కొత్త బైక్స్ ఇవే.. సరికొత్త లుక్.. సెన్సేషనల్ ఫీచర్లు..
కొత్త ద్విచక్ర వాహనాల కోసం ఎదురుచూస్తున్న వారికి మిలాన్ లో జరుగుతున్న ఈఐసీఎంఏ కొత్త ఉత్సాహాన్ని నింపింది. పలు ఆసక్తికరమైన ఉత్పత్తులు వినియోగదారులను తన వైపు తిప్పుకున్నాయి. గ్లోబల్ అటెన్షన్ ను డ్రా చేశాయి. అవి త్వరలోనే మన దేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కొన్ని ద్విచక్రవాహనాలు అంచనాలను అమాంతం పెంచేశాయి. అలాంటి వాటిల్లో టాప్ టూ వీలర్ల గురించి ఈ కథనంలో వివరిస్తున్నాం. జాబితాలో రాయల్ ఎన్ ఫీల్డ్ హిమాలయన్ 452, హీరో జూమ్ 160, అల్ట్రావయోలెట్ ఎఫ్99, కవాసకి నింజా, కవాసకి జెడ్500, హోండా సీబీ650ఆర్/సీబీఆర్650ఆర్ వంటి ద్విచక్రవాహనాలున్నాయి.
Updated on: Nov 13, 2023 | 8:35 PM

హీరో జూమ్ 160.. హీరో మోటో కార్ప్ కూడా ఈఐసీఎంఏ వద్ద తన కొత్త జూమ్ 160 ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది. అలాగే మ్యాక్సీ ను కూడా ప్రదర్శించింది. ఇది 160 సీసీ లిక్విజ్ ఇంజిన్ తో వస్తుంది. 14బీహెచ్పీ, 13.7ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలో దీనిని వచ్చే ఏడాదిలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

హోండా సీబీ650ఆర్/సీబీఆర్650ఆర్.. హోండా సీబీఆర్600ఆర్ఆర్, సీబీ1000 హార్నెట్ తో పాటు 650ఆర్ సిరీస్ ను ఈఐసీఎంఏ ఈవెంట్లో ఆవిష్కరించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఈ బైక్స్ లను హోండా అప్ గ్రేడ్ చేసిన ఈఐసీఎంఏలో ప్రదర్శించింది. వీటిల్లో సీబీ650ఆర్, సీబీఆర్650ఆర్ మాత్రం మన దేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కంపెనీ చెబుతోంది.

కవాసకి నింజా/జెడ్500.. ఈఐసీఎంఏ ఈవెంట్లో కవాసాకి నింజా 500, జెడ్500లను ఆవిష్కరించింది. ఇది కొత్త 451సీసీ సమాంతర జంట ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ రెండూ భారతదేశంలో నింజా 400ని భర్తీ చేయవచ్చు లేదా 400, 650సీసీ శ్రేణి మధ్య ఉంచవచ్చు. కవాసకి భారతదేశంలో తన మొత్తం శ్రేణిని విక్రయిస్తున్నందున, నింజా 500, జెడ్500 వచ్చే ఏడాది ప్రారంభంలో భారతదేశంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452.. రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొట్టమొదటి ఆల్ ఎలక్ట్రిక్ బైక్ ను ఈఐసీఎంఏ ఈవెంట్లో ఆవిష్కరించంది. ప్రస్తుత అభివృద్ధి దశలో ఉన్న మోటార్‌సైకిల్ ప్రోటో టైప్ ను ఆ కంపెనీ ప్రదర్శించింది. ఈ బైక్ అత్యంత కఠినమైన ప్రదేశాల్లో కూడా సులభంగా ప్రయాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఈ బైక్ ను హిమాలయాల్లో పరీక్షిస్తున్నారు. ఇది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో కంపెనీ ప్రకటించలేదు.

అల్ట్రావయోలెట్ ఎఫ్99.. ఇది సరకొత్త డిజైన్ తో ఆకట్టుకుంది. అలాగే ఈ బైక్ పనితీరు కూడా అధికంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ మోటార్‌సైకిల్ ట్రాక్-ఓన్లీ వెర్షన్‌గా కనిపిస్తుంది. ఇది లిక్విడ్-కూల్డ్ మోటార్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది 3 సెకన్లలో 0 నుంచి 100కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. గరిష్టంగా గంటకు 265కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలగుతుంది. ఈ అల్ట్రావయోలెట్ ఎఫ్99 బైక్ 2025లో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. మన దేశంలో ఎప్పుడు అనేది దానిపై స్పష్టత లేదు.




