Cumin Seeds Benefits: కిచెన్ లో ఉన్న దివ్య ఔషధం జీల కర్ర.. ఇలా తీసుకుంటే అన్నీ సెట్ అవుతాయ్!

వంటగదుల్లో ఉండే పోపు దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే అన్నారు పెద్దలు.. వంటిల్లే వైద్య శాల అని. ప్రస్తుతం ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టి ట్యాబ్లెట్స్ వంటివి వేసుకుంటున్నారు. పూర్వం అయితే అన్ని రోగాలకు వంటింట్లో ఉండే పోపు దినుసులనే ఉపయోగించేవారు. కిచెన్ లో మనకు ఎప్పుడూ లభ్యమయ్యే వాటిల్లో జీల కర్ర కూడా ఒకటి. జీలకర్ర వంటకు చక్కటి రుచిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీల కర్రను వంటల్లో వాడటం వల్ల చాలా..

Cumin Seeds Benefits: కిచెన్ లో ఉన్న దివ్య ఔషధం జీల కర్ర.. ఇలా తీసుకుంటే అన్నీ సెట్ అవుతాయ్!
Cumin Water
Follow us

|

Updated on: Nov 13, 2023 | 7:39 PM

వంటగదుల్లో ఉండే పోపు దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే అన్నారు పెద్దలు.. వంటిల్లే వైద్య శాల అని. ప్రస్తుతం ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా డాక్టర్ల వద్దకు పరుగులు పెట్టి ట్యాబ్లెట్స్ వంటివి వేసుకుంటున్నారు. పూర్వం అయితే అన్ని రోగాలకు వంటింట్లో ఉండే పోపు దినుసులనే ఉపయోగించేవారు. కిచెన్ లో మనకు ఎప్పుడూ లభ్యమయ్యే వాటిల్లో జీల కర్ర కూడా ఒకటి. జీలకర్ర వంటకు చక్కటి రుచిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. జీల కర్రను వంటల్లో వాడటం వల్ల చాలా అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. మన శరీరానికి అవసరం అయ్యే అన్ని పోషకాలు జీల కర్రలో దాగి ఉన్నాయి. ఇప్పటికే జీల కర్రలో ఉండే ఔషధాల గురించి ఎన్నో తెలుసుకున్నాం. ఇంకా మరి కొన్ని టిప్స్ ని ఇప్పుడు తెలుసుకుందాం.

నులి పురుగులు నశిస్తాయి:

నులి పురుగులు కూడా నశిస్తాయి. కడుపులో నులి పురుగులు ఉండటం వల్ల ఆకలి వేయదు. అంతే కాదు రక్త హీనతతో బాధ పడుతూ ఉంటారు. ముఖ్యంలో పిల్లల కడుపులో నులి పురుగులు ఉంటే కడుపులో నొప్పితో నీరసంగా ఉంటారు. దేని మీద ధ్యాస పెట్టరు. కాబట్టి పిల్లల చేత కూడా బెల్లాన్ని కలిపి జీల కర్రని నమిలి పిస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

డయేరియాకి చెక్ పెట్టొచ్చు:

డయేరియాతో బాధ పడే వారికి సైతం జీల కర్ర చక్కగా పని చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో ఒక స్పూన్ జీల కర్ర, స్పూన్ కొత్తి మీర రసం, కొద్దిగా ఉప్పు వేసి.. భోజనం తర్వాత తీసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు తాగితే.. డయేరియా అదుపులోకి వస్తుంది.

నిద్ర లేమి సమస్య తగ్గుతుంది:

ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో.. ఒత్తిడి వల్ల సరిగ్గా నిద్ర పట్టడం లేదు. చాలా మంది నిద్ర లేమి సమస్యలతో బాధ పడుతున్నారు. అలాంటి వారు జీల కర్రను బాగా వేయించి.. అరటి పండుతో కలిపి తింటే బాగా నిద్ర పడుతుంది.

సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పడతాయి:

జీలకర్రలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. జీల కర్రను ఏదో రూపంలో తీసుకుంటూ ఉంటే.. శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. నీటిలో చిన్న ముక్క అల్లం వేసి బాగా మరిగించాలి. చివరిలో ఇందులో వేయించిన జీలక్ర పొడి వేసి కలుపుకుని తాగితే.. జ్వరం, గొంతు నొప్పి, జలుబు వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

బరువు తగ్గుతారు:

అధిక బరువుతో ఇబ్బంది పడే వారు.. నీటిలో జీల కర్ర పొడి, మిరియాల పొడి, కొద్దిగా యాలకుల పొడి వేసి చిన్న మంటపై బాగా మరిగించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా తాగడం వల్ల బరువు తగ్గుతారు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
పారిస్ లో చిరంజీవి ఫ్యామిలీ.. స్పెషల్ అట్రాక్షన్‌గా క్లింకార..
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
రంభ, ఊర్వశి, మేనకలను కలగలిపిన అనుపమ అందం.!
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
వరుణుడి ప్రతాపం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
అతనితో కీర్తి సురేశ్ పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందిగా..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
కాంటాక్ట్ లెన్స్‌ వల్ల నటి జాస్మిన్ భాసిన్‌కు తీవ్ర అనారోగ్యం..
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
వికసిత్‌ భారత్‌ లక్ష్యం.. నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. ఈ క్యూటీపై అందాలకి పడని హృదయం ఉంటుందా.!
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
చిన్న పిల్లాడితో లిప్ కిస్‌లా? ఆ లేడీ యాంకర్ పై చిన్మయి ఆగ్రహం
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
ఏయే వయసులవారికి ఎంతెంత నిద్ర అవసరమో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు
రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు