Milk Health Benefits: పాలను తాగడానికి అయిష్టత చూపిస్తున్నారా? అయితే మీరు చాలా కోల్పోతున్నట్లే.. ఎందుకంటే..
Milk Health Benefits: పాలు మనిషి జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. మానవ శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు పాల ద్వారా అందుతాయి. అయితే మనలో చాలా మంది పాలను తాగడానికి...
Milk Health Benefits: పాలు మనిషి జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. మానవ శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు పాల ద్వారా అందుతాయి. అయితే మనలో చాలా మంది పాలను తాగడానికి ఆసక్తి చూపించరు. టీ పౌడర్ లేదా కాఫీ పౌడర్‌ను కలుపుకొని తాగడానికి ఆసక్తిచూపిస్తారు. అయితే ఇలా తాగడం వల్ల సరైన పోషకాలు లభించవు. అయితే పాలతో కలిగే లాభాలు ఏంటో తెలిస్తే అస్సలు వదులుకోరు. ఇంతకీ పాల ద్వారా ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం..
* ఎముకల బలానికి ఉపయోగపడే క్యాల్షియం పాలలో పుష్కలంగా లభిస్తాయి. 250 మిల్లీ లీటర్ల పాలలో 285 మి.గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. మనిషికి రోజులో అవసరమయ్యే సుమారు 20 శాతం క్యాల్షియం ఒక్క కప్పు పాలతో లభిస్తుంది.
* పాలలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్ ఏ, బీ1, బీ2, బీ12, డీ, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి.
* వర్కవుట్లు చేసిన తర్వాత పాలను తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. శరీరారికి అవసరమైన అత్యవసర శక్తి పాలతో అందుతుంది. కండరాల సమస్యను పాలు తరిమికొడతాయి.
* బరువు తగ్గించడంలోనూ పాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవల పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో భాగంగా పాలలోని లినొలెనిక్ యాసిడ్ శరీరంలోని కొవ్వును కరిగిస్తున్నట్లు గుర్తించారు.
* విటమిన్ డీ లోపంతో బాధపడే వారు పాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఎముకల ఆరోగ్యానికి ఇది ఎంతో అవసరం.
* పాలలో పసుపును కలుపుకొని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది ఆరోగ్య నిపుణులు ఇదే విషయాన్ని చెబుతున్నారు.
* వేడి పాలను తీసుకోవడం ద్వారా గొంతు నొప్పి, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
* రక్తపోటు తగ్గించడంలో పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పాలలో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. పాలలో ఎక్కువ మోతాదులో ఉండే పొటాషియం, తక్కువ మోతాదులో ఉండే సోడియం హృదయ సంబంధిత రోగాలు దరిచేరనివ్వవు.
Also Read: AIIMs On Covid-19: మృత్యు భయాన్ని తొలగిస్తున్న కరోనా వ్యాక్సిన్.. టీకా పనితీరుపై ఎయిమ్స్ అధ్యయనం
Corbevax Vaccine: త్వరలోనే దేశంలో అతి తక్కువ ధరకే కొవిడ్ వ్యాక్సిన్.. పూర్తి వివరాలు
Covid Third Wave: కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి మాట.. కొవిడ్ థర్డ్ వేవ్ ఆ నెలలో వచ్చే అవకాశం? ఎప్పుడంటే?