Aortic Aneurysm: సైలెంట్ కిల్లర్ బృహద్ధమని సంబంధ అనూరిజం అంటే ఏమిటి? దీనిని గుర్తించడం ఎలా?
Aortic Aneurysm: బృహద్ధమని సంబంధ అనూరిజం(aortic aneurysm) ఇది ఒక రకమైన గుండె జబ్బు. చాలా మందికి దీని గురించి తెలియదు. సాధారణంగా గుండె జబ్బు అనగానే మనకు కవాటాలు పనిచేయకపోవడం..రక్తం సరఫరాకు ఆటంకం వంటి లక్షణాలే తెలుసు.
Aortic Aneurysm: బృహద్ధమని సంబంధ అనూరిజం(aortic aneurysm) ఇది ఒక రకమైన గుండె జబ్బు. చాలా మందికి దీని గురించి తెలియదు. సాధారణంగా గుండె జబ్బు అనగానే మనకు కవాటాలు పనిచేయకపోవడం.. కొవ్వు వలన రక్తం సరఫరాకు ఆటంకం కలగటం వంటి లక్షణాలే తెలుసు. ఒకవేళ ఎవరైనా గుండె జబ్బుతో ఇబ్బంది పడి ప్రాణాలు కోల్పోయారు అంటే ఈ కారణాల వల్లే అనుకుని బాధపాదతాం. కానీ, గుండె జబ్బులకు మరో కారణం కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. అదే aortic aneurysm అంటే బృహద్దమని సంబంధ అనూరిజం. సాధారణంగా శరీరంలో ఏవైనా నాళాల గోడలు బలహీనం పడటం వలన అవి విస్తరిస్తాయి. దీనినే అనూరిజం అంటారు. ఇక్కడ ధమనుల గోడలు ఇలా విస్తరిస్తాయి. అందుకే దీనిని బృహద్దమని సంబంధ అనూరిజం అంటారు. బృహద్ధమని అంటే గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని చేరవేసే ముఖ్యమైన నాళం. ఈ ధమని గోడలు బలహీన పడి వ్యాకోచిస్తే వచ్చే సమస్య బృహద్ధమని సంబంధ అనూరిజం. ఇది కొన్నిసార్లు అంతర్గత రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.
పరిశోధనల ప్రకారం, బృహద్ధమని సంబంధ అనూరిజం ఉన్న చాలా మందిలో, ఇది నిర్దిష్ట లక్షణాలను చూపించనందున దీనిని గుర్తించలేరు. ఈ వ్యాధి స్కానింగ్ తర్వాత మాత్రమే బయటపడుతుంది. అల్ట్రాసౌండ్ సాధారణంగా బృహద్ధమని సంబంధ అనూరిజంలను గుర్తించడానికి చేస్తారు. ధమనుల వాపు ఈ వ్యాధి ఉనికిని సూచిస్తాయి.
ఇక మామూలుగా ఈ వ్యాధికి సంబంధిచిన లక్షణాలు ఏవీ ప్రమాదం చోటు చేసుకునే వరకూ పైకి కనిపించవు. ధమని గోడ దెబ్బతినే ముందు రోగి దానిని గ్రహించనందున పరిశోధకులు ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఈ వ్యాధి అత్యవసర పరిస్థితిని సృష్టిస్తుంది. పరిశోధనల ప్రకారం బృహద్ధమని సంబంధ అనూరిజంతో బాధపడుతున్న రోగులలో 50% మంది ఆసుపత్రికి చేరేలోపు మరణిస్తున్నారు. శస్త్రచికిత్స తర్వాత కూడా, రోగి యొక్క పరిస్థితి మెరుగుపడే అవకాశం 50 శాతం మాత్రమే.
ఇప్పుడు ఈ వ్యాధిపై చేస్తున్న పరిశోధనల్లో ఒక ప్రత్యెక విషయం తెలుసుకున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన ఒక పరిశోధనా నివేదిక ప్రకారం, బొటనవేలు మరియు అరచేతితో చేసిన పరీక్ష ఒక వ్యక్తిలో బృహద్ధమని సంబంధ అనూరిజం వ్యాధి ప్రమాదం గురించి చాలా ఖచ్చితమైన ఆలోచనను ఇస్తుంది. ఈ పరీక్ష ఎలా చేయాలో కింది చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు..
శరీరంలో అనూరిజం గుర్తించడానికి, మొదట అరచేతిని పూర్తిగా తెరవాలి. ఇప్పుడు నెమ్మదిగా బొటనవేలును చిన్న వేలి దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నించాలీ. అరచేతి మధ్యలో బొటనవేలు వస్తే, అప్పుడు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువ. ప్రమాదం పెరిగినప్పుడు బొటనవేలు చిన్న వేలు యొక్క సరిహద్దు వెలుపల పొడుచుకు వచ్చినట్లయితే, బృహద్ధమని సంబంధ అనూరిజం ప్రమాదం ఉండవచ్చు. ఎముకలు పొడవు, కీళ్ళు మృదువుగా ఉండటం వల్ల ఇది జరుగుతుంది, ఇది ఈ వ్యాధికి సంకేతంగా ఉంటుంది.
ఈ పరీక్షను చాలా మందిలో గుర్తించారు
ఈ పరీక్షను అభివృద్ధి చేసిన యేల్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. జాన్ ఎ. పాజిటివ్ పరీక్షించిన తర్వాత కూడా కొంతమందికి గుండె జబ్బులు లేవని, అయితే చాలా మందికి ఈ వ్యాధి ఉన్నట్లు తేలిందని ఎలిఫ్తీరియోస్ వివరించింది. ఈ పరీక్ష ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లయితే చేయాల్సి ఉంటుంది.
Also Read: Black Fungus : కోవిడ్ బారినపడిన ఈ వ్యాధి గ్రస్తుల నోరు శుభ్రత లేకపోతే ముప్పు తప్పదంటున్న వైద్య బృందం