HAIR TRANSPLANTS: బట్టతల వేధిస్తోందా..? అయితే ఈ పని చేయండి.. వెట్రుకలు వస్తాయి..!
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్(HAIR TRANSPLANTS).. బట్టతల ఉన్నవారికి మళ్లీ ఒత్తైన జుట్టును అందించే ఓ మార్గం. కానీ, తలపై వెంట్రుకలు(HAIRS) నాటే ఈ విధానంపై ఎన్నో అనుమానాలు ఉంటాయి...
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్(HAIR TRANSPLANTS).. బట్టతల ఉన్నవారికి మళ్లీ ఒత్తైన జుట్టును అందించే ఓ మార్గం. కానీ, తలపై వెంట్రుకలు(HAIRS) నాటే ఈ విధానంపై ఎన్నో అనుమానాలు ఉంటాయి. అయితే, ఒక్కసారి బట్టతల వచ్చిందంటే.. ట్రాన్స్‌ప్లాంటేషన్ మినహా ఇంకేఇతర ఆలోచనలు పెట్టుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. సాధారణ పద్ధతుల్లో బట్టతలపై వెంట్రుకలు రావడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. మందులు, పీఆర్పీ(PRP) వంటి వాటి వల్ల వెంట్రుకలు వస్తాయని అనుకోవడం అపోహేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి అవసరమైన వివరాలు తెలిపారు నిపుణులు. “హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో రెండు రకాలు ఉంటాయి.
మొదటి పద్ధతిలో.. బట్టతలపై జట్టు తెప్పించేందుకు.. తల వెనక భాగంలోని చర్మం, వెంట్రుకలను ఉపయోగిస్తాం. వీటిని కావాల్సిన చోట ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. చికిత్సలో ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా ఈ విధానం ప్రస్తుతం ఎక్కువగా పాటించడం లేదు. రెండో (ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్) విధానంలో.. స్కిన్‌తో సంబంధం లేకుండా వెంట్రుకలను మాత్రమే తీసుకొని కావాల్సిన చోట ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాం. దీని వల్ల మనం మూడు నుంచి నాలుగు రోజుల్లో సాధారణ జీవనం ప్రారంభించుకోవచ్చు. కుట్లు ఉండవు, వాపు ఉండదు. పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదు. రోపోటిక్ మూడో విధానం ఉంటుంది. కానీ ఇది చాలా అధునాతన పద్ధతి. పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి” అని నిపుణులు వివరించారు.