Hair Protection Tips: జుట్టు వేగంగా పెరగేందుకు 7 సహజ పద్ధతులు.. అవేంటంటే..
Hair Protection Tips: పొడవాటి జుట్టును ఎవరుమాత్రం వద్దు అనుకుంటారు చెప్పండి. అయితే, పోషకాహారం సరిపోకపోవడం వల్ల,
Hair Protection Tips: పొడవాటి జుట్టును ఎవరుమాత్రం వద్దు అనుకుంటారు చెప్పండి. అయితే, పోషకాహారం సరిపోకపోవడం వల్ల, ఇతర కారణాల వల్ల జుట్టు పెరగడం ఆగిపోయి.. రాలిపోవడం మొదలవుతుంది. జుట్టు తిరిగి బలంగా మారాలన్నా.. జుట్టు రాలిపోవడం తగ్గాలన్నా.. కొన్ని పద్ధతులను పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా జుట్టును సహజంగానే పెంచుకోవచ్చనిచ చెబుతున్నారు. మరి ఆ పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం.
కండీషనర్.. కండీషనర్ వాడటం వల్ల జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా జుట్టు తక్కువగా రాలిపోతుంది. కావున హెయిర్ కండిషనర్ ఉపయోగించడం మంచిదంటున్నారు.
కత్తిరించడం.. ప్రతి ఎనిమిది నుండి పది వారాలకు ఒకసారి జుట్టు కత్తిరించడం వలన వెంట్రుకలు వేగంగా పెరగడానికి అవకాశం ఉంది. ధూళి, సూర్యరశ్మి కారణంగా, జుట్టు చివరలు సాధారణంగా చిట్లిపోయినట్లు కనిపిస్తాయి. దానిని నిర్లక్ష్యం చేస్తే రెండు చివర్లకు అది వ్యాపిస్తుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. అయితే, మీరు మీ జుట్టును క్రమం తప్పకుండా కత్తిరించడం వల్ల, స్ప్లిట్ చివరలను కత్తిరించడం వల్ల జట్టు వేగంగా పెరుగుతుంది.
వేడి నూనెతో మసాజ్.. వేడి నూనెతో మసాజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి వారం వేడి నూనెతో మీ జుట్టుకు మసాజ్ చేయడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం మీరు కొబ్బరి, ఆలివ్ లేదా లావెండర్ నూనెను ఉపయోగించవచ్చు. ఇది మీ జుట్టును అందంగా మరియు పెరగడానికి సహాయపడుతుంది.
ప్రతి రాత్రి క్రమం తప్పకుండా దువ్వుకోవాలి.. అధికంగా బ్రష్ చేయడం వల్ల జుట్టు రాలడం, జుట్టు దెబ్బతింటుందనే వార్తలు మీరు వినే ఉంటారు. అయితే, రాత్రి పడుకునే ముందు జుట్టు దువ్వుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుందంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల జుట్టు మూలాలు బలపడతాయని, వేగంగా పెరుగుతుందంటున్నారు.
తడి జుట్టును టవల్‌తో కట్టుకోకండి.. షాంపూతో స్నానం చేసిన తర్వాత తడి జుట్టును టవల్‌తో చుట్టే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే, తడి జుట్టును టవల్‌తో చుట్టడం వల్ల జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. అందుకని, మీరు మైక్రోఫైబర్ టవల్ ఉపయోగించడం ఉత్తమం.
ఒత్తిడిని తగ్గించుకుంటే మంచిది.. ఒత్తిడి మీ ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావాలను కలిగిస్తుంది. పని లేదా వ్యక్తిగత సమస్యల వల్ల అధిక ఒత్తిడి కలిగి జుట్టు రాలడం జరుగుతుంది. ఈ ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా సాధన చేయండి.
నెత్తికి గుడ్డును అప్లై చేయాలి.. జుట్టుకు గుడ్డు సొనను రాయవచ్చు. జుట్టు పెరుగుదలకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో ఒక చెంచా ఆలీవ్ ఆయిల్ కలపండి. ఆ మిశ్రమాన్ని నెత్తికి రాయాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత జుట్టును శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నెలకు ఒకసారి చేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది.
Also read:
Immunity Booster Food: ఈ ఐదింటిని రోజూ తీసుకోండి.. ఇమ్యూనిటీని పెంచుకోండి..