Health Tips: బెల్లీ ఫ్యాట్ తగ్గాలా.. ఉదయాన్నే ఈ వాటర్ తాగితే బెస్ట్ రిజల్ట్స్..!
Health Tips: ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అయితే పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడానికి వెల్లుల్లి వాటర్ మంచి ఎంపిక. వెల్లుల్లి గుండె జబ్బుల నుంచి కాపాడటమే కాకుండా బరువును తగ్గిస్తుంది.
Garlic Water For Weight Loss: ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు పెరగడం చాలా సులభం. కానీ, బరువు తగ్గడం కూడా అంతే కష్టం. మరోవైపు, డైటింగ్, వర్కౌట్ చేసిన తర్వాత పొట్ట కొవ్వు తగ్గడానికి నెలల సమయం పడుతుంది. కానీ, మీరు త్వరగా ఫిట్ అవ్వాలనుకుంటే, వెల్లుల్లి వాటర్ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి గార్లిక్ వాటర్ బెటర్ ఆప్షన్. ఇది పోషకాలతో నిండి ఉంది. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా గుండె జబ్బుల నుంచి రక్షించడంతో పాటు బరువును కూడా తగ్గిస్తుంది. గార్లిక్ వాటర్ తాగడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడంలో వెల్లుల్లి ఎలా పని చేస్తుంది? వెల్లుల్లిలో ఫైబర్, కాల్షియం, విటమిన్ బి6, విటమిన్ సి, మాంగనీస్ ఉంటాయి. ఈ పోషకాలన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. మీరు ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అవలంబించడంతో పాటు వెల్లుల్లి నీరు లేదా వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే, మీ బరువు ఒక వారంలో తగ్గించవచ్చు.
వెల్లుల్లి శరీరం నుంచి విషాన్ని, హానికరమైన పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. వెల్లుల్లిలో ఆకలిని తగ్గించే గుణాలు ఉన్నాయి. దీని వల్ల ఎక్కువ తినాలనే కోరిక ఉండదు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది. వెల్లుల్లి జీవక్రియను పెంచుతుంది. ఇది శక్తి స్థాయిని పెంచుతుంది. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేయాలి- ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తురిమిన వెల్లుల్లిని కలపండి. దీన్ని ఖాళీ కడుపుతో తాగండి. ఇలా చేయడం వల్ల మీ పొట్ట కొవ్వు సులభంగా తగ్గిపోతుంది.
Also Read: Vaccination: టీకా తీసుకున్నాక పిల్లల్లో ఈ సమస్యలుంటే భయపడవద్దు.. వైద్యుడి సలహా తీసుకోండి..
India Omicron: దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు..