Japanese Water Therapy: జపనీస్ వాటర్ థెరపీ గురించి మీకు తెలుసా? కేవలం నీళ్లు తాగడం వల్లనే ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు..
ఆరోగ్యం, క్రమశిక్షణ, టెక్నాలజీ పరంగా అగ్రస్థానంలో ఉన్న దేశం జపాన్. జపాన్ ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా నీటిపై ఆధారపడతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జపనీస్ ఆరోగ్య రహస్యం నీళ్లలోనే దాగి ఉంది. జపనీస్ నీటి శుద్ధి పద్ధతులు వారి మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు. ఈ పద్ధతిని చాలా ఏళ్లుగా మన పూర్వికులు అవలంభిస్తున్నారు. దాని మూలం మూలం జపనీస్..

ఆరోగ్యం, క్రమశిక్షణ, టెక్నాలజీ పరంగా అగ్రస్థానంలో ఉన్న దేశం జపాన్. జపాన్ ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా నీటిపై ఆధారపడతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా జపనీస్ ఆరోగ్య రహస్యం నీళ్లలోనే దాగి ఉంది. జపనీస్ నీటి శుద్ధి పద్ధతులు వారి మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాసు నీళ్లు తాగాలని వైద్యులు చెబుతుంటారు. ఈ పద్ధతిని చాలా ఏళ్లుగా మన పూర్వికులు అవలంభిస్తున్నారు. దాని మూలం మూలం జపనీస్ నుంచి వచ్చిందంటున్నారు నిపుణులు. జపనీయులు నీళ్ల వినియోగం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ జపనీస్ వాటర్ థెరపీ ఎలా ఉంటుంది? ఏ విధంగా పనిచేస్తుందో ఆ వివరాలు మీ కోసం..
నిద్రలేచిన తర్వాత జపనీయులు చేసే మొదటి పని నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు తాగుతారు. తొందరపడకుండా నిదానంగా నీళ్లు తాగుతారు. అప్పుడే అది మన శరీరంలో సక్రమంగా పనిచేస్తుంది. దాంతో పాటు శరీరంలో వాటర్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది. నీళ్లు తాగిన తర్వాత పళ్ళు తోముకోవడం, నోటిని శుభ్రపరచడం వంటి నోటి పరిశుభ్రతను క్రమం తప్పకుండా పాస్తారు. నీరు త్రాగిన తర్వాత, ఏదైనా ఆహారం లేదా పానీయం తీసుకునే ముందు తప్పని సరిగా కనీసం 45 నిమిషాల సమయం తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల మన శరీరం పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించేలా చేస్తుందట. భోజన సమయంలో జాగ్రత్తగా ఆహారం తీసుకోవాలని వారు సలహా ఇస్తున్నారు. ఇది ఆహారాన్ని బాగా నమలాలి. భోజన సమయంలో ఎక్కువ నీరు తాగడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది జీర్ణక్రియపై ఒత్తిడి తెస్తుంది.
ఖాళీ కడుపుతో నీరు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..
ఖాళీ కడుపుతో నీరు త్రాగడం జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్‌లు నీటి ద్వారా లభిస్తాయి. నీరు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది కాబట్టి, జీర్ణవ్యవస్థ ద్వారా జీర్ణక్రియ కూడా చాలా సులభతరం అవుతుంది. ఆహారం తినే ముందు ఎక్కువ నీళ్లు తాగితే, ఆహారం సరిపడా తినలేరు. చాలా తక్కువ ఆహారం తినడంతోనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉండదు. అంతేకాకుండా కడుపు చాలా కాలం పాటు నిండినట్లు అనిపిస్తుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.