Child Care Tips: పిల్లలు విపరీతంగా దగ్గుతున్నారా.. ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి!
అన్ని కాలల్లో కంటే.. శీతా కాలం వేరు. ఈ వింటర్ సీజన్ వచ్చిందే పలు అనారోగ్య సమస్యలతో బాధ పడాల్సిందే. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఎటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చలి కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. ఈ ప్రభావం అధికంగా చిన్న పిల్లలపై పడుతుంది. శీతా కాలంలో చలి, పొగ మంచు కారణంగా దగ్గు, జలుబు అనేవి వస్తాయి. పిల్లల్లో ఒక్కసారి ఇవి వచ్చాయంటే అంత తేలికగా తగ్గవు. అయితే ఈ దగ్గు తగ్గించేందుకు..

అన్ని కాలల్లో కంటే.. శీతా కాలం వేరు. ఈ వింటర్ సీజన్ వచ్చిందే పలు అనారోగ్య సమస్యలతో బాధ పడాల్సిందే. చిన్నా.. పెద్దా అనే తేడా లేకుండా జ్వరం, జలుబు, దగ్గు వంటివి ఎటాక్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చలి కాలంలో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గి పోతుంది. ఈ ప్రభావం అధికంగా చిన్న పిల్లలపై పడుతుంది. శీతా కాలంలో చలి, పొగ మంచు కారణంగా దగ్గు, జలుబు అనేవి వస్తాయి. పిల్లల్లో ఒక్కసారి ఇవి వచ్చాయంటే అంత తేలికగా తగ్గవు. అయితే ఈ దగ్గు తగ్గించేందుకు ఈ ఇంటి చిట్కాలు కూడా బాగా పని చేస్తాయి. మరి అవేంటో ఒకసారి చూసేద్దాం.
తులసి:
ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క అనేది కామన్ గా ఉంటుంది. ఇంట్లోకి చెడు గాలి ప్రవేశించకుండా ఉండేందుకు తులసి మొక్కను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మీ పిల్లలు దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటే.. తులసి ఆకుల రసానికి.. తేనె కలిపి ఇవ్వడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గొంతు నొప్పిని కూడా తగ్గిస్తుంది.
యూకలిప్టస్ ఆయిల్:
యూకలిప్టస్ ఆయిల్ ప్రస్తుతం మార్కెట్లో విరివిగా లభిస్తుంది. మీ పిల్లలు జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటే.. ఓ రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ పడుకునే ముందు దిండుపై వేసి.. వాసన పీల్చుతూ ఉండమని చెప్పాలి. ఇలా ఈ ఆయిల్ పీల్చడం వల్ల ముక్కు దిబ్బడనే కాకుండా దగ్గు కూడా తగ్గుతుంది.
పసుపు:
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. గోరు వెచ్చటి పాలలో పసుపు కలిపి తాగితే.. గొంతు నొప్పే కాకుండా.. రోగ నిరోధక శక్తి కూడా మెరుగు పడుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.
వెల్లుల్లి:
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో వెల్లుల్లి, తేనె బాగా హెల్ప్ అవుతాయి. ఈ చిట్కా రెండు సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు ఇవ్వాలి. చిన్న వెల్లుల్లి రెబ్బను మెత్తగా కోసి.. తేనెతో కలిపి తినడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.