Vizag: భీమిలి బీచ్‌లో మార్నింగ్ వాక్..కనిపించింది చూసి సంబరం.. అనుకోని అదృష్టం..
సాధారణంగా మత్స్యకారుల వృత్తి చేపల వేట.. ఆ గంగమ్మ తల్లిని నమ్ముకుని ప్రతిరోజు వేటకు వెళుతూ ఉంటారు తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు. కొంతమందికి అదృష్టం వరించి వల నిండా చేపలు చిక్కితే.. మరి కొంతమందికి కష్టానికి తగ్గ ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. సముద్రంలో వేట చేశాక వలకు చిక్కిన చేపలను తీసుకొచ్చి.. వాటిని అమ్మి పొట్ట పోసుకుంటారు మత్స్యకారులు. అయితే విశాఖ భీమిలి తీరంలో.. ఓ మత్స్యకారుడికి పంట పండింది. అది కూడా.. సముద్రంలోకి వెళ్లకుండా.. చేపల వేట చేయకుండానే.. అదెలాగో తెలుసుకోవవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఆ మత్స్యకారుడు కూడా అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టానికి ఎగిరి గంతేసాడు. విశాఖ భీమిలి ప్రాంతానికి చెందిన అల్లిపెల్లి నరసింగరావు అనే వ్యక్తి స్థానికంగా మత్స్యకార నాయకుడు. ఏళ్లుగా చేపల వేటే ఆయన జీవనాధారం. వంశ పారంపర్యంగా వారి వృత్తి చేపల వేట.
అయితే.. నర్సింగరావు గత కొంతకాలంగా చేపల వేట చేయిస్తున్నాడు. ఉదయాన్నే వాకింగ్ చేయడం అతనికి అలవాటుగా మారింది. దీంతో అలా భీమిలి తీరంలో నడుస్తూ ఉన్నాడు. అలా వెళ్తూ ఉండగా.. దూరంగా ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లే కొద్దీ ఆసక్తి.. ఎట్టకేలకు సమీపానికి చేరుకున్నాడు. అది చేప.. భారీగా ఉంది. దాదాపుగా 12 కిలోల బరువు ఉంటుంది. దాన్ని పరిశీలిస్తే అది పాల బొంత చేపగా గుర్తించాడు నర్సింగరావు. అనుకోని అదృష్టం కలిసి రావడంతో ఎగిరి గంతేశాడు. వాస్తవానికి చాలామంది సముద్రంలోకి వేటకు వెళ్లిన.. ఈ పాల బొంతల చేపలు దొరకడం అరుదు. అది కూడా ఇంత భారీ చేపలు అస్సలు చిక్కవు. లోతైన జలాల్లో మాత్రమే ఈ చేపలు సంచరిస్తూ ఉంటాయట. చాలా అరుదుగా లభించే ఈ పాల బొంత చేపలు తినేందుకు చాలా రుచిగా ఉంటాయని అంటున్నారు. ఇలా ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఈ భారీ పాల బొంత చేపను తనతో పాటు తీసుకెళ్లాడు నర్సింగరావు. ఇది కదా మరి అదృష్టం అంటే..!. సుమారు 12 కేజీల బరువున్న ఈ చేప ధర సుమారు రెండు వేల రూపాయలు ఉంటుందని నర్సింగరావు చెబుతున్నారు.

Narsingarao With Rare Fish
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
