AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి భారీ విరాళం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల సందర్భంగా, టీటీడీ అన్నప్రసాద పథకానికి భాష్యం రామకృష్ణ రూ.44 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ విరాళంతో ఒక రోజు అన్నప్రసాదం పంపిణీ చేశారు.

సీఎం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా టీటీడీ అన్నప్రసాదానికి భారీ విరాళం
Cm Chandrababu
SN Pasha
|

Updated on: Apr 20, 2025 | 3:26 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్న ప్రసాద పథకానికి రూ.44 లక్షలు విరాళం అందించారు. ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు 75 పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒక రోజు అన్న ప్రసాద వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ రూ.44 లక్షలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు.

అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రాజేంద్ర, వీజీఓ సురేంద్ర, అన్నప్రసాదాల ప్రత్యేక అధికారి శాస్త్రీ తదితర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
చక్కెర డబ్బాలో చీమల దండయాత్ర.. ఈ ఒక్క వస్తువుంటే దెబ్బకు పరార్..
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?
టీ20 ప్రపంచకప్‌ జట్టులో తుఫాన్ ప్లేయర్.. అసలెవరీ నందినీ శర్మ..?