Covid Sub Variant JN.1: తస్మాత్ జాగ్రత్త.. మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్ కేసులు.. కేంద్రం కీలక ఆదేశాలు..
భారతదేశంలో మరోసారి కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు కేంద్రవర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి మన దేశంతోపాటూ ప్రపంచ దేశాలను వణికించిన విషయం మనకు తెలిసిందే. అయితే మన్నటి వరకూ రకరకాల వేరియంట్లు వచ్చినప్పటికీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన కోవిడ్ జెఎన్.1 (JN.1) వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపిస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ
భారతదేశంలో మరోసారి కోవిడ్ కేసులు విజృంభిస్తున్నట్లు కేంద్రవర్గాలు హెచ్చరిస్తున్నాయి. గత రెండేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి మన దేశంతోపాటూ ప్రపంచ దేశాలను వణికించిన విషయం మనకు తెలిసిందే. అయితే మన్నటి వరకూ రకరకాల వేరియంట్లు వచ్చినప్పటికీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన కోవిడ్ జెఎన్.1 (JN.1) వేరియంట్ పెద్ద ఎత్తున ప్రజలపై ప్రభావం చూపిస్తున్నట్లు భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన రిపోర్ట్‌లో గుర్తించబడింది.
కోవిడ్ జెఎన్.1 (JN.1) వేరియంట్ పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కేరళకు చెందిన 79 ఏళ్ల మహిళలో ఓమిక్రాన్ సబ్-వేరియంట్ బిఏ.2.86తోపాటు జెఎన్.1 అనే కొత్త వేరియంట్ కనుగొనబడింది. దీంతో కోవిడ్ కేసుల పెరుగుదల మళ్లీ ఆందోళనలను కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన లెక్కల ప్రకారం ప్రతి రోజు ఈ కేసుల సంఖ్య 2,000 కి చేరుకుంటుందని తెలిపింది. ఆదివారం కేరళలో నలుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు మొత్తం ఐదు మంది మరణించినట్లు ప్రకటించింది.
ఈ రకమైన వైరస్ అన్ని దేశాలలో అభివృద్ధి చెందుతోందని, త్వరగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. జెఎన్.1 (JN.1) వేరియంట్ ఎలాంటి లక్షణాలు లేని ఇన్‌ఫెక్షన్ నుండి తీవ్రమైన వ్యాధిగా మారి మరణానికి దారి తీస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ మరియా వాన్ కెర్‌ఖోవ్ చెప్పారు. అమెరికా, చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నందున, సింగపూర్ ఇటీవల మాస్క్ వాడాలని సూచించింది. దీంతోపాటు కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయాణికులను హెచ్చరించింది.
మనదేశం విషయానికొస్తే.. కర్ణాటకలో సీనియర్ సిటిజన్లు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాస్క్ తప్పనిసరి చేసింది. కేరళతో సరిహద్దు ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని ఆదేశాలను జారీ చేసింది. జెఎన్ (JN.1) అనేది ఒక కొత్త వేరియంట్. ఇది 2022 జనవరి-మార్చిలో మన దేశంలో ఓమిక్రాన్ వేరియంట్‌గా రూపాంతరం చెందినట్లు తెలిపారు. దీని ప్రభావంతో రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గి అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. చాలా మందికి తేలికపాటి అనారోగ్యాలను కలిగిస్తుందని చెబుతున్నారు డాక్టర్లు.
రోగనిరోధక శక్తి లేని వ్యక్తులకు, 65 ఏళ్లు పైబడిన వారికి, మధుమేహం లేదా గుండె జబ్బులు, క్యాన్సర్ మొదలైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. తేలికపాటి అనారోగ్యం నుంచి తీవ్రమైన ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రస్తుతం క్రిస్మస్, పెళ్లిళ్ల సీజన్‌లు ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. అందరూ ఒకేచోట గుమిగూడటం వల్ల ఈ వైరస్ మరింతగా వృద్ధి చెందేలా చేస్తుంది. గతంలో వచ్చిన వేరియంట్లకంటే కూడా జెఎన్ వేరియంట్ ప్రభావం తీవ్రంగా పడుతుందని చెబుతున్నారు డాక్టర్లు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..