Viral: అప్పుడే పుట్టిన బిడ్డను బోరుబావిలో పడేశారు.. ఎవరు కన్నారో.. ఎందుకు పడేశారో.?
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో అప్పుడే పుట్టిన పసి బిడ్డను కనికరం లేకుండా బోరుబావిలో పడేశారు. పసి పాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది ఏడు గంటలపాటు శ్రమించి నవజాత శిశువును కాపాడారు. అసలేం జరిగిందంటే.. లారిపాలి గ్రామంలో వినియోగంలో లేని బోర్‌వెల్‌లో అప్పుడే పుట్టిన పసి బాలికను ఎవరో పడేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పసి బిడ్డ ఏడుపు విన్న గ్రామస్తులు..
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో అప్పుడే పుట్టిన పసి బిడ్డను కనికరం లేకుండా బోరుబావిలో పడేశారు. పసి పాప ఏడుపు విన్న స్థానికులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రెస్క్యూ సిబ్బంది ఏడు గంటలపాటు శ్రమించి నవజాత శిశువును కాపాడారు. అసలేం జరిగిందంటే.. లారిపాలి గ్రామంలో వినియోగంలో లేని బోర్‌వెల్‌లో అప్పుడే పుట్టిన పసి బాలికను ఎవరో పడేశారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు పసి బిడ్డ ఏడుపు విన్న గ్రామస్తులు పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వైద్య బృందాలను రప్పించి బోరుబావిలోకి ఆక్సిజన్ సరఫరా చేశారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో అధునాతన కెమెరాను రప్పించారు. బోరుబావిలోని 13 అడుగుల లోతులో చిన్నారి చిక్కుకున్నట్లు గుర్తించారు. జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. సుమారు ఏడు గంటలపాటు రెస్క్యూ సిబ్బంది శ్రమించారు.
చివరకు మంగళవారం రాత్రి 9.40 గంటలకు ఆ చిన్నారిని సురక్షితంగా బోరువెల్ నుంచి బయటకు తీశారు. వెంటనే బుర్లా వీఐఎంఎస్‌ఏఆర్ ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత సంరక్షణ విభాగానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు నవజాత శిశువును బోర్‌వెల్‌లో పడేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.