Chhattisgarh: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య.! వీడియో వైరల్..

వివాహమైన తరువాత ఒకరికి ఒకరుగా కలిసిమెలసి జీవిస్తారు భార్యాభర్తలు. ఒకరికి ఏదైనా కష్టం వస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. ఛత్తీస్‌గఢ్‌లో భర్త కోసం భార్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే .. బతౌలీలోని భారత్ మాతా చౌక్ నివాసి, హార్డ్‌వేర్ దుకాణం నిర్వాహకుడు ఆయుష్‌ అగర్వాల్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య తన కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టింది.

Chhattisgarh: కిడ్నీ దానంతో భర్త ప్రాణాలు కాపాడిన భార్య.! వీడియో వైరల్..

|

Updated on: Dec 18, 2023 | 11:02 AM

వివాహమైన తరువాత ఒకరికి ఒకరుగా కలిసిమెలసి జీవిస్తారు భార్యాభర్తలు. ఒకరికి ఏదైనా కష్టం వస్తే మరొకరు తల్లడిల్లిపోతారు. ఛత్తీస్‌గఢ్‌లో భర్త కోసం భార్య తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే .. బతౌలీలోని భారత్ మాతా చౌక్ నివాసి, హార్డ్‌వేర్ దుకాణం నిర్వాహకుడు ఆయుష్‌ అగర్వాల్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో అతని భార్య తన కిడ్నీని దానం చేసి భర్త ప్రాణాలను నిలబెట్టింది. ఈ కిడ్నీ మార్పిడి చికిత్స తర్వాత ఆయుష్‌ అగర్వాల్‌ కోలుకున్నారు. ఆయుష్ అగర్వాల్‌ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ప్రతి 15 రోజులకోసారి డయాలసిస్ చేయించుకోవాల్సి వచ్చేది. వైద్యులు కిడ్నీ మార్పిడి చేయాలని ఆయుష్‌కు సూచించారు.

అయితే నిబంధనల ప్రకారం రక్త సంబంధీకుల నుంచి మాత్రమే కిడ్నీ తీసుకోవలసి ఉంటుంది. అతని భార్య నిషా అగర్వాల్ తన కిడ్నీని భర్తకు దానం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆయుష్ అగర్వాల్ ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. మొరుగైన వైద్యం కోసం వైద్యుల పర్యవేక్షణలో నాలుగు నెలల ఉన్నారు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో భార్యాభర్తలిద్దరూ ముంబై నుంచి తిరిగి బతౌలీ చేరుకున్నారు. త్వరలోనే తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభించనున్నానని ఆయుష్‌ తెలిపారు. తన భార్య తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందని ఆనందంగా తెలిపారు. భర్తకు కిడ్నీని దానం చేసిన నిషా అగర్వాల్‌ అభినందనీయురాలని వైద్యులు కొనియాడారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Follow us
Latest Articles
ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీసెలబ్రిటీలు..
ఓటు హక్కు వినియోగించుకుంటున్న సినీసెలబ్రిటీలు..
బీభత్సం సృష్టించిన గాలివాన.. పిడుగుపడి రైతు, మనవడు మృతి
బీభత్సం సృష్టించిన గాలివాన.. పిడుగుపడి రైతు, మనవడు మృతి
ప్రజలందరూ ఓటేసేందుకు కదిలిరావాలి.. పులివెందులలో సీఎం జగన్..
ప్రజలందరూ ఓటేసేందుకు కదిలిరావాలి.. పులివెందులలో సీఎం జగన్..
బెంగళూరు విజయంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పు
బెంగళూరు విజయంతో పాయింట్ల పట్టికలో కీలక మార్పు
ఆ రాజసం మళ్లీ వచ్చేస్తోంది.. అంబాసిడర్ కొత్త లుక్‌ ఎలా ఉండనుందంటే
ఆ రాజసం మళ్లీ వచ్చేస్తోంది.. అంబాసిడర్ కొత్త లుక్‌ ఎలా ఉండనుందంటే
ఇదేం పాడు బుద్ధి.. ఏటీఎం నుంచి రూ.77 లక్షలు కాజేసిన సిబ్బంది!
ఇదేం పాడు బుద్ధి.. ఏటీఎం నుంచి రూ.77 లక్షలు కాజేసిన సిబ్బంది!
ఏమి ఆ సౌందర్యం.. దేవకన్యలా ముస్తాబయిన సంయుక్త.
ఏమి ఆ సౌందర్యం.. దేవకన్యలా ముస్తాబయిన సంయుక్త.
క్యూలైన్‎లో నిల్చొని ఓటు వేసిన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్..
క్యూలైన్‎లో నిల్చొని ఓటు వేసిన అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్..
టీ20 ప్రపంచకప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ ప్లేయర్
టీ20 ప్రపంచకప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ ప్లేయర్
రోజు 10వేల అడుగులు నడవండి.. ఎన్ని మార్పులు జరుగుతాయో గమనించండి
రోజు 10వేల అడుగులు నడవండి.. ఎన్ని మార్పులు జరుగుతాయో గమనించండి