Vande Bharat: వందేభారత్‌ సూపర్‌ హిట్‌.! ధర ఎక్కువైనా ప్రయాణానికి ఆసక్తి చూపుతున్న ప్రజలు.

Vande Bharat: వందేభారత్‌ సూపర్‌ హిట్‌.! ధర ఎక్కువైనా ప్రయాణానికి ఆసక్తి చూపుతున్న ప్రజలు.

Anil kumar poka

|

Updated on: Dec 18, 2023 | 10:54 AM

కాచిగూడ- బెంగళూరు వందేభారత్‌ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రైలు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుస్తోంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లాలన్నా అక్కడినుంచి తిరిగి రావాలన్నా వెయిటింగ్‌ లిస్ట్‌ భారీగానే ఉంటోంది. కాచిగూడ సహా దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడంతో విస్తృత ప్రచారం చేశారు. ఒకసారైనా ఈ రైలులో ప్రయాణం చేయాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.

కాచిగూడ- బెంగళూరు వందేభారత్‌ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం రైలు పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుస్తోంది. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్లాలన్నా అక్కడినుంచి తిరిగి రావాలన్నా వెయిటింగ్‌ లిస్ట్‌ భారీగానే ఉంటోంది. కాచిగూడ సహా దేశవ్యాప్తంగా నడుస్తున్న వందే భారత్‌ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడంతో విస్తృత ప్రచారం చేశారు. ఒకసారైనా ఈ రైలులో ప్రయాణం చేయాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు. దీని టికెట్‌ ధర సాధారణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల టికెట్‌కన్నా ఎక్కువే అయినా లెక్క చేయకుండా ఇందులో ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతున్నారు. నిత్యం కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా మైసూరుకు వెళ్లే మామూలు ఎక్స్‌ప్రెస్‌ రైలు 24 బోగీలతో రాత్రివేళ నడుస్తుంది. ఇందులో బెర్త్‌ల సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో తక్కువ బోగీలు ఉంటాయి. అదికూడా పగటి పూట నడుపుతుండటం వల్ల బెర్త్‌లకు బదులు ఛైర్‌కార్‌ సదుపాయాన్ని కల్పించారు. దీనిలో సీట్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది.

నగరంలోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు అధికంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. కాచిగూడ నుంచి నేరుగా బెంగళూరుకు అక్కడి నుంచి తిరిగి నగరానికి వచ్చే ప్రయాణికులే అధికంగా ఉంటున్నారని రైల్వే అధికార వర్గాలు తెలిపాయి. మధ్య స్టేషన్లలో ఎక్కేవారు, దిగేవారి శాతం చాలా తక్కువని చెప్పారు. తెల్లవారు జామున ఐదున్నర గంటలకు కాచిగూడలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటిగంట 45 నిమిషాలకు బెంగళూరుకు చేరుకుంటుంది. తిరిగి అక్కడ 2 గంటల 45 నిమిషాలకు బయలుదేరి రాత్రి 11 గంటల 20 నిమిషాలకు కాచిగూడకు వస్తుంది. వారంలో బుధవారం రోజు మాత్రం ఈ రైలును నడపటం లేదు. ఆ రోజున నిర్వహణ కోసం దీన్ని షెడ్డుకు పంపిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.