వేసవిలో పెరుగు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరానికి చలువ చేయడంతోపాటు జీర్ణవ్యవస్థ పనితీరు బాగుండాలంటే ప్రతిరోజూ పెరుగు తీసుకోవాలి
TV9 Telugu
పైగా మనం తీసుకునే ఇతర పదార్థాల నుంచి పోషకాలనూ శరీరం స్వీకరించడంలోనూ పెరుగు పాత్ర కీలకం. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి
TV9 Telugu
పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి
TV9 Telugu
పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కడుపును చల్లగా ఉంచుతుంది. అలాగే వేసవిలో సబ్జా గింజలు కూడా చాలా మంది తీసుకుంటూ ఉంటారు
TV9 Telugu
ఈ విత్తనాల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. అయితే సబ్జా గింజలను పెరుగుతో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
TV9 Telugu
పెరుగు, సబ్జా గింజలను కలిపి తినడం వల్ల కడుపులోని ప్రేగులకు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. పైగా పెరుగు, సబ్జా గింజలు కలిపి తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది
TV9 Telugu
ఫలితంగా ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పెరుగు, సబ్జా గింజలు కడుపు సమస్యలు ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి
TV9 Telugu
ఇది ఆమ్లత్వం, ఉబ్బరాన్ని కలిగించదు. సబ్జా గింజలు గుండెకు చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. పెరుగుతో వీటిని కలిపి తినడం వల్ల LDL అంటే చెడు కొలెస్ట్రాల్ సమస్య రాదు