- Telugu News Photo Gallery Saturn's transit into Uttarabhadra star brings unexpected benefits to those of the four zodiac signs
27 ఏళ్ల తర్వాత సొంత నక్షత్రంలోకి శని.. ధనవంతులయ్యే అదృష్ట జాతకులు వీరే!
గ్రహాలలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాం కొన్ని సార్లు మంచి ఫలితాలనిస్తే, మరికొన్ని సార్లు నష్టాలను తీసుకొస్తుంది. అయితే చాలా రోజుల తర్వాత శని తన సొంత నక్షత్రంలో సంచారం చేయబోతుంది. దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం లక్కు కలిసి వస్తుంది.
Updated on: Apr 20, 2025 | 3:59 PM

శని గ్రహం 27 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 28వ తేదీన తన సొంత నక్షత్రం ఉత్తరాభాద్రలోకి ప్రవేశించబోతుంది. దీంతో నాలుగు రాశుల వారి జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకోవడమే కాకుండా, ఎన్నో లాభాలు కూడా చేకూరుతాయి. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి : శని సంచారంతో వృషభరాశి వారికి ఊహించని విధంగా డబ్బులు రావడం జరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. చాలా రోజులుగా వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటాబయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా సంతోషంగా గడుపుతారు.

మిథున రాశి : శని సంచారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కృషికి మంచి ప్రశసలు అందుతాయి. ధనవంతులు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. చాలా రోజుల నుంచి పేదవారిగా ఉన్న వారు కూడా డబ్బు సంపాదించి ధనవంతులయ్యే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు.

మకర రాశి వారికి శని తన సొంత నక్షత్రంలోకి ప్రవేశించడం వలన చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సానుకూల ఆలోచనలతో ముందుకెళ్లడం వలన అన్ని పనులు త్వరగా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంపద పెరుగుతుంది. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.



