బెండ తింటే ఇండదిక ఏ బెంగ.. వేసవి రోజుకు 2 తిన్నాచాలు..!
20 April 2025
TV9 Telugu
TV9 Telugu
బెండకాయ.. రుచికి బాగానే ఉన్నా బంకగా ఉంటుందని తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే దాంతో అనేక లాభాలున్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనే విషయం తెలిస్తే ఎప్పటికీ వదిలిపెట్టరు
TV9 Telugu
బెండలోని సహజసిద్ధమైన తేమజిగురు లేదా బంక (ఓక్రా మ్యూసిలేజ్) మానవ శరీరంలోని పలు రుగ్మతల నివారణకు దోహదపడుతుంది. పచ్చి బెండకాయను నానబెట్టడం ద్వారా వచ్చే తేమ జిగురును తాగడం ద్వారా రోగాలను పారదోలచ్చట
TV9 Telugu
బెండ ఏడాదంతా లభించే కూరగాయల్లో ఒకటి. బెండలో అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో విటమిన్లు ఎ, బి, సి, కె, మెగ్నీషియం, ఫోలేట్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి
TV9 Telugu
వేసవిలో ప్రతిరోజూ ఆహారంలో బెండ చేర్చుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు అంటున్నారు. దీన్ని తినడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉంటుంది
TV9 Telugu
వేసవిలో రోజూ బెండ తినడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు కూడా తగ్గుతాయి. గుండె పని తీరును మెరుగుపరుస్తుంది. ఇది బరువు తగ్గడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది
TV9 Telugu
బెండలో మంచి మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఫలితంగా బరువు తగ్గడం సులభం అవుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. ఇది కడుపును శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
బెండలో విటమిన్లు ఎ, సి ఉన్నందున ఇది మృత కణాలను సరిచేయడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది
TV9 Telugu
ముఖ్యంగా డయాబెటిస్ ఉంటే బెండకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే చాలా మందికి వివిధ కూరగాయలకు అలెర్జీ ఉంటుంది. బెండకాయ తినడం వల్ల కూడా ఏవైనా శారీరక సమస్యలు వస్తే దానిని తినకపోవడమే మంచిది