AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patanjali: పతంజలి ఆయుర్వేద్‌ గులాబ్‌ షర్బత్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! వేసవిలో కచ్చితంగా తాగాల్సిన డ్రింక్‌

వేసవిలో ఆరోగ్యకరమైన పానీయాల కోసం పతంజలి ఆయుర్వేద గులాబీ షర్బత్‌ను ఎంచుకోండి. రైతుల నుండి నేరుగా సేకరించిన గులాబీల తో తయారైన ఈ షర్బత్‌లో తక్కువ చక్కెర ఉంటుంది. సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులతో తయారు చేయబడి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Patanjali: పతంజలి ఆయుర్వేద్‌ గులాబ్‌ షర్బత్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! వేసవిలో కచ్చితంగా తాగాల్సిన డ్రింక్‌
Patanjali Rose Sharbat
SN Pasha
|

Updated on: Apr 19, 2025 | 7:14 PM

Share

వేసవి రాగానే, కోలా, సోడా, ఫ్రూట్‌ జ్యూస్‌లకు డిమాండ్ ఆకస్మాత్తుగా పెరుగుతుంది. కానీ, వీటిలో చాలా వరకు ఆరోగ్యానికి హాని చేసేవే ఉంటాయి. అయితే బాబా రామ్‌దేవ్, బాలకృష్ణ ఆచార్య కంపెనీ పతంజలి ఆయుర్వేద తన గులాబ్‌ షర్బత్‌తో పాటు ఇతర ఉత్పత్తులతో మొత్తం పానీయాల పరిశ్రమను మార్చడానికి కృషి చేస్తోంది. ఇందులో ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే.. కంపెనీ ఉత్పత్తులు రైతు పొలం నుండి నేరుగా మీ డైనింగ్ టేబుల్‌కు చేరుతాయి. అంటే మీ ఆరోగ్యంతో పాటు, కంపెనీ దేశంలోని రైతులను ఆర్థికంగా మెరుగుపరచడంపై కూడా దృష్టి పెడుతోంది.

పతంజలి ఆయుర్వేద గులాబ్‌ షర్బత్ కోసం రైతుల నుండి నేరుగా గులాబీలను కొనుగోలు చేస్తుంది. దీనివల్ల రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. గులాబ్‌ షర్బత్ తయారీకి సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతిని ఉపయోగిస్తారు. దీని వల్ల మీకు మంచి ఆరోగ్యం ప్రయోజనాలు అందుతాయి.

గులాబ్‌ షర్బత్‌తో ఆరోగ్య ప్రయోజనాలు..

పతంజలి ఆయుర్వేదం గులాబీ షర్బత్‌ తయారీ ప్రక్రియ చాలా సహజంగా ఉంటుంది. రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసిన తాజా గులాబీ పూల రేకులను ఇందులో ఉపయోగిస్తారు. ఈ పువ్వులను ఎక్కువగా సేంద్రీయ పద్ధతిలో పండిస్తారు. మధ్యవర్తుల పాత్ర తక్కువగా ఉండటం వల్ల, అవి కల్తీ జరిగే అవకాశం ఉండదు. మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులతో పోలిస్తే ఈ షర్బత్‌లో తక్కువ చక్కెర ఉపయోగిస్తున్నారు. దీంతో ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పతంజలి అంటే ఆయుర్వేద నిధి..

బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ పతంజలి ఆయుర్వేదాన్ని ప్రారంభించినప్పుడు దాని మొదటి లక్ష్యం ఆయుర్వేద ప్రయోజనాలను ప్రజలకు సులభమైన మార్గంలో అందుబాటులో ఉంచడం. అందులో భాగంగానే వేసవి కోసం తయారుచేసిన ఈ గులాబ్‌ షర్బత్‌ తయారీలో కంపెనీ అదే ప్రాథమిక సూత్రాన్ని అనుసరించింది. ఈ షర్బత్‌లో గులాబీతో ఇతర ఔషధ మూలికలను కలిపారు. ఇవి వేసవిలో మన శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. అలాగే వేడి నుండి ఉపశమనం కలిగించడానికి కంపెనీ ఖుస్ కా షర్బత్, బేల్ కా షర్బత్ వంటి సాంప్రదాయ భారతీయ పానీయాలను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి