గులాబీ సిరప్‌లోని ప్రతి చుక్క ‘జాతీయ సేవ’కు అంకితం.. గొప్ప సంకల్పంతో ముందుకొచ్చిన పతంజలి!
బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ పతంజలి ఆయుర్వేద FMCG రంగంలోకి ప్రవేశించి సంచలనం సృష్టిస్తోంది. ఆయుర్వేద ప్రయోజనాలను ప్రజలకు సులభంగా అందించడం కోసం పతంజలి పని చేస్తోంది. ఇది కేవలం ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన విషయం కాదు, పతంజలి ఆయుర్వేద గులాబీ సిరప్‌లోని ప్రతి చుక్క 'జాతీయ సేవ' అని పతంజలి హామీని ఇస్తుంది.

యోగా, ఆయుర్వేద రంగంలో బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణ ద్వయం తమకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. పతంజలి ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయుర్వేద, మూలికా ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఈ సంస్థ సహజ, సాంప్రదాయ భారతీయ పానీయాలను ప్రవేశపెట్టింది. ఆయుర్వేద, కార్బోనేటేడ్ నీటి ఆధారిత పానీయాలు, సోడా ఆధారిత పానీయాలు, కెఫిన్ ఆధారిత పానీయాల హానికరమైన ప్రభావాల నుండి దేశ ప్రజలను రక్షించడానికి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది.
వేసవిలో దాహార్తి తీర్చేందుకు గులాబీ షర్బత్, మామిడి ఆధారిత పండ్ల రసాలు, బేల్ షర్బత్, ఖుస్ షర్బత్ వంటి పానీయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ షర్బత్ ద్వారా ప్రజల ఆరోగ్యానికి మాత్రమే సేవ చేయడమే కాకుండా, దేశానికి సేవ చేయాలనే తన సూత్రంపై కూడా పనిచేస్తోందని సంస్థ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
పతంజలి ఆయుర్వేద గులాబీ సిరప్ తయారీలో ఆయుర్వేద సాంప్రదాయ వంటకాన్ని ఉపయోగించిందని చెబుతోంది. అంతేకాదు, దీనిని తయారు చేసే పద్ధతిని కూడా సహజంగా ఉంటుందన్నారు. తద్వారా దాని సహజ లక్షణాలను కాపాడుకోవచ్చు. దీనికోసం, పతంజలి ఆయుర్వేద రైతుల నుండి నేరుగా గులాబీలను కొనుగోలు చేస్తుంది. తద్వారా మధ్యవర్తుల పాత్రను తగ్గించి, స్వచ్చంగా ఉండేలా చూస్తోంది. కల్తీ లేని ఆహార పదార్థాలను దేశ ప్రజలకు అందించాలన్న సంకల్పంతో పతంజలి పని చేస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని పతంజలి ఫుడ్ పార్క్‌లో మూలికల సేంద్రీయ వ్యవసాయం జరుగుతుంది. వీటిని ప్రజల ఆరోగ్యానికి మేలు చేసే ఉత్పత్తులను తయారు చేయడంలో ఉపయోగిస్తారు. పతంజలి ఆయుర్వేద బేల్, ఖుస్ సిరప్‌ను కూడా సాంప్రదాయ, సహజ పద్ధతిలో తయారు చేస్తుంది. అంతేకాదు, పతంజలి ఆయుర్వేద తన ఉత్పత్తులతో దేశానికి సేవ చేస్తుంది. ఆయుర్వేదానికి సేవ చేయడంతో పాటు, పతంజలి ఈ ఉత్పత్తుల నుండి వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని సమాజ సంక్షేమం కోసం ఖర్చు చేసింది. పతంజలి ఆయుర్వేద గులాబీ షర్బత్ తోపాటు ఇతర ఉత్పత్తుల నుండి లాభాలను ఆర్జిస్తుంది. ఇందులో కొంత భాగాన్ని గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలోని పేద పిల్లలకు విద్యను అందించడానికి ఉపయోగిస్తారు. అందుకే పతంజలి ఆయుర్వేద గులాబీ సిరప్‌లోని ప్రతి చుక్క ‘జాతీయ సేవ’ అని పతంజలి హామీని ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




