AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలోని ఆ రహస్య ప్రాంతంలో ఏలియన్స్‌..వీడియో

అమెరికాలోని ఓ ప్రాంతం నెట్టింట వైరల్‌గా మారింది. అవును.. ఆ ప్రాంతం అత్యంత రహస్య సైనిక స్థావరం. నెవాడాగా పిలిచే ఈ సీక్రెట్ ప్లేస్ లో ఓ నిర్మాణానికి సంబంధించిన గూగుల్‌ ఎర్త్‌లో కనిపించిన ఫోటోలు అందరి దృష్టిని అటువైపు ఆకర్షించాయి. నెవాడలోని ఏరియా-51లోని ఈ నిర్మించిన ఈ ఎత్తైన టవర్‌ పై రకరకాల ప్రచారాలు పుట్టుకొచ్చాయి. దీని గురించి కొందరు యూజర్లు ఏఐ బాట్‌ గ్రోక్‌ను కూడా అడిగారు. అందులో వారికి విచిత్రమైన సమాధానం వచ్చింది. అది స్టెల్త్‌ విమానం పరీక్షించేందుకు ఏర్పాటు చేసినదై ఉండొచ్చని, లేదంటే ఉపగ్రహాలను తప్పుదోవ పట్టించేందుకు నిర్మించిన డెకాయ్‌ కావచ్చని చెప్పింది.

Samatha J
|

Updated on: Apr 20, 2025 | 12:03 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఏరియా 51 అత్యంత రహస్య ప్రాంతం. ఇక్కడ అమెరికా సైన్యం శిక్షణ పొందుతుంది. శాస్త్రవేత్తలు ఆయుధాలు సహా పలు రకాల టెక్నాలజీలను పరీక్షిస్తారు. ఈ స్థావరాన్ని 1955లో ఏర్పాటు చేశారు. నెవాడ ఎడారిలో 200 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది. ఇక్కడ గతంలో లాక్‌హీడ్‌ మార్టిన్‌ యూ-2 నిఘా విమానాలను పరీక్షించారు. ఆ తర్వాత నుంచి అనేక రహస్య ఫైటర్‌ జెట్ల పనితీరును కూడా ఇక్కడ పరిశీలించారు. ఒకప్పుడు ఇక్కడ ఉపగ్రహ చిత్రాలు తీయడంపై నిషేధం ఉండేది. కానీ, ఇప్పుడు దాన్ని తొలగించారు. ఈ స్థావరం చుట్టూ మోషన్‌ సెన్సర్లు అమర్చారు. గస్తీ బృందాలు ఎప్పుడూ పహారా కాస్తుంటాయి. సందర్శకులను హెచ్చరిస్తూ పలు చోట్ల బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. నో ఫ్లై జోన్లు, కొన్ని మార్గాల్లో ప్రయాణించడంపై నిషేధాలు ఉంటాయి. గ్రహాంతరవాసులు, గుర్తుతెలియని ఎగిరే వస్తువులు వంటి వాటితో ఏరియా 51కు బలమైన సంబంధాలున్నాయన్న ప్రచారం ఉంది.

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?