మహిళ స్నానం చేస్తుండగా పై నుంచి ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా..
మహిళలు స్నానం చేస్తుండగా సీక్రెట్‌గా వీడియోలు తీసిన ఓ ఘనుడికి దేహశుద్ధి చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన బిశ్వాల్ సర్కార్ కొన్ని నెలల క్రితం పార్వతీపురం పట్టణంలోని బొగ్గు వీధిలో నివాసముంటున్నాడు. స్థానికులతో చనువుగా ఉండే అతను పట్టణంలోని భవాని ఫైల్స్ అనే ఆస్పత్రిలో ఆర్ ఎం పి వైద్యుడిగా జాయిన్ అయ్యాడు. కొన్ని నెలలుగా అక్కడే ఉద్యోగం చేస్తున్న బిశ్వాల్ సర్కార్ ఎక్కువ సమయం హాస్పిటల్ లోనే ఉండేవాడు. అయితే ఆస్పత్రి వెనుక వైపు దుగరాజు పేట అనే కాలనీ ఉంది. ఆ కాలనీ పరిసర ప్రాంతమంతా గ్రామీణ వాతావరణం తలపిస్తుంటుంది. అక్కడ నివాసముండే స్థానికుల కుటుంబాల్లో స్నానపు గదులకు పైన ఎలాంటి పై కప్పులు లేకుండా ఓపెన్ గా ఉంటాయి.
ఈ క్రమంలోనే ఒకరోజు సాయంత్రం హాస్పిటల్ బిల్డింగ్ పైకి వెళ్లిన బిస్వాల్ ఓ మహిళ స్నానం చేయడాన్ని గమనించాడు. వెంటనే తన సెల్‌ఫోన్‌తో ఆ మహిళ వీడియోలను, ఫోటోలను తీశాడు. అప్పటి నుంచి నిత్యం మహిళలు స్నానం చేసే సమయాన్ని గమనించి మరికొందరు మహిళల ఫోటోలు, వీడియోలు తీస్తూ పైశాచికానందం పొందేవాడు. ఈ క్రమంలోనే ఒకరోజు స్నానం చేస్తున్న ఒక మహిళకు బిశ్వాల్ సర్కార్ వ్యవహారాన్ని గమనించింది. వెంటనే ఆ విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలియజేయడంతో వారు హుటాహుటిన ఇరుగుపొరుగు వారిని తీసుకొని హాస్పిటల్ వద్దకు వచ్చి మేడపై ఉన్న బిశ్వాల్ వద్దకు వెళ్లారు. అక్కడ బిశ్వాల్ తప్ప మరో వ్యక్తి లేకపోవడంతో తమ ఫోటోలు తీసింది అతనేనని నిర్థారించుకున్నారు. సెల్ ఫోన్ లాక్కొని పరిశీలించగా ఫోన్ లో పలువురు మహిళల ఫోటోలు, వీడియోలు చూసి స్థానికులు షాకయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయిన మహిళలు చెప్పులతో దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
