AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akarsh: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అతనొక్కడే!.. ప్రతిష్ఠాత్మక డ్యూక్‌ వర్సిటీలో అడ్మిషన్ కొట్టేసిన ఆకర్ష్!

ఏపీలోని విజయవాడకు చెందిన అకర్ష్ చిట్టినేని అతి తక్కువ మంది ప్రవేశం పొందగలిగే ప్రతిష్ఠాత్మక అమెరికన్ డ్యూక్‌ యూనివర్సిటీలో అడ్మిషన్ సాధించాడు. మన రెండు తెలుగు రాష్ట్రా నుంచి ఈ డ్యూక్ యూనివర్సిటీలో కేవలం ఆకర్ష్‌ మాత్రమే చోటు దక్కించుకోగా.. దేశ వ్యాప్తంగా ఆరుగురు అడ్మిషన్లు సాధించారు.

Akarsh: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అతనొక్కడే!.. ప్రతిష్ఠాత్మక డ్యూక్‌ వర్సిటీలో అడ్మిషన్ కొట్టేసిన ఆకర్ష్!
Akarsh Chittineni
Anand T
|

Updated on: Apr 20, 2025 | 4:16 PM

Share

తాము అనుకున్నది సాధించాలని చాలా మంది కలలు కంటుంటారు..కానీ వాటిని సాధించేందుకు కొందరే కష్టపడతారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా..వాటిని ఎదుర్కొని నిలబడి అనుకున్నది సాధించేవారు కొందరే ఉంటారు. అలాంటి కోవకు చెందిన కుర్రాడే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆకర్ష్ చిట్టినేని.  ఇతను అతి తక్కువ మంది ప్రవేశం పొందగలిగే ప్రతిష్ఠాత్మక డ్యూక్ యూనివర్సిటీలో అడ్మిషన్ దక్కించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రా నుంచి ఈ డ్యూక్ యూనివర్సిటీలో కేవలం ఆకర్ష్‌ మాత్రమే చోటు దక్కించుకోగా.. దేశ వ్యాప్తంగా ఆరుగురు అడ్మిషన్లు సాధించారు. క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకిగ్స్‌లో ఆరో స్థానంలో నిలిచిన ఆకర్ష్‌ చిట్టినేనికి అమెరికాలోని 40 ప్రతిష్టాత్మక యూనివర్సిటీస్‌ నుంచి ఆఫర్స్‌ వచ్చాయి. వీటితో పాటు రూ. 25 కోట్ల విలువైన స్కాలర్‌షిప్ ఆఫర్ పొందడంతో.. ప్రపంచ స్కాలర్‌ల ఎలైట్ లీగ్‌లోకి అకర్ష్ చేరాడు. ఈ ఆగస్ట్‌ నెలలో అకర్ష్ ఈ ప్రతిష్ఠాత్మక అమెరికన్ విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టనున్నాడు.

విజయవాడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివిన ఆకర్ష్.. వరుసగా ఆరు సంవత్సరాలు స్కూల్‌ టాపర్‌గా నిలిచాడు. 10thలో ఫస్ట్ క్లాస్‌ మార్కులు సాధించి..గోల్డ్‌ మెడల్‌ కూడా సాధించాడు. SAT ప్రవేశపరీక్షలో 98 శాతం మార్కులు సాధించి నాలుగు అడ్వాన్స్‌డ్ ప్లేస్‌మెంట్ పరీక్షలలో డిస్టింక్షన్లతో ఏపీ స్కాలర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇదే కాకుండా స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మల్టీవేరియబుల్ కాలిక్యులస్ అధ్యయనం చేసేందుకు స్కాలర్‌షిప్‌ పొందాడు. 2023 ఏప్రిల్‌లో అమెరికాలోని అలబామాలో జరిగిన NASA హ్యూమన్ ఎక్స్‌ప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ (HERC)-2023 పోటీలో కూడా అవార్డు గెలుచుకున్నాడు.

ప్రతిష్ఠాత్మక అమెరికన్ డ్యూక్‌ విశ్వవిద్యాలయంలో చోటు దక్కిడంపై అకర్ష్ హర్షం వ్యక్తం చేశాడు. తన ప్రయాణం కేవలం కళాశాల అడ్మిషన్ల గురించి మాత్రమే కాదని.. తాను నేర్చుకునే పరిజ్ఞానాన్ని ఇతరులకు ఉపయోగపడేలా చేస్తానన్నాడు. “డ్యూక్ యూనివర్సిటీలో తాను కేవలం విద్యార్థిగా మాత్రమే కాకుండా, చరిత్ర సృష్టించే వ్యక్తిగా ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి