Tea in Clay Pots: మట్టి కుండల్లో టీ తాగితే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

టీ తాగడం ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి.. ఉదయం నిద్రలేవ గానే ఘుమఘుమలాడే వేడివేడి టీ గొంతులో పడితే గానీ కొంత మందికి రోజు ప్రారంభం కాదు. అలసట కలిగిన, మూడ్‌ చేంజ్‌ చేయడానికైనా ఒక్క కప్పు టీ తాగితే చాలు అన్నీ మాయం అయిపోతాయ్‌. కాబట్టి టీ తాగే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రోజులో ఎన్ని సార్లైనా టీ తాగడం కోసం డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. చాలా మందికి ఫ్యాన్సీ కంటైనర్లలో టీ తాగాలని కోరుకుంటారు...

Tea in Clay Pots: మట్టి కుండల్లో టీ తాగితే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..
Tea In Clay Pots
Follow us

|

Updated on: Dec 17, 2023 | 8:49 PM

టీ తాగడం ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి.. ఉదయం నిద్రలేవ గానే ఘుమఘుమలాడే వేడివేడి టీ గొంతులో పడితే గానీ కొంత మందికి రోజు ప్రారంభం కాదు. అలసట కలిగిన, మూడ్‌ చేంజ్‌ చేయడానికైనా ఒక్క కప్పు టీ తాగితే చాలు అన్నీ మాయం అయిపోతాయ్‌. కాబట్టి టీ తాగే వారి సంఖ్య తక్కువేమీ కాదు. రోజులో ఎన్ని సార్లైనా టీ తాగడం కోసం డబ్బు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు. చాలా మందికి ఫ్యాన్సీ కంటైనర్లలో టీ తాగాలని కోరుకుంటారు. ఇటీవల కాలంలో వివిధ రోడ్‌సైడ్ టీ స్టాల్స్‌లో ఈ పానీయాన్ని ప్లాస్టిక్ కంటైనర్‌లలో అందిస్తున్నారు. ఇలా ప్లాస్టిక్‌ కప్స్‌లో టీ తాగడం ఆరోగ్యానికి హానికరం.

ఈ సాంకేతిక యుగంలో మానవ నాగరికత మరింత అభివృద్ధి చెందింది. అయితే మట్టి కుండలలో కూడా టీ రుచి చూసేందుకు చాలా మంది అసక్తి చూపుతుంటారు. మట్టి కుండలో టీ తాగడం తృప్తిగా అనిపిస్తుందని చెబుతుంటారు. ఇప్పటికీ చాలా చోట్ల టీ స్టాల్స్‌లో మట్టి కుండల్లో టీ తాగడం కనిపిస్తుంది. నిజానికి మట్టి కుండ నుండి టీ తాగడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

మట్టి కుండలో టీ ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసా?

చాలా మంది పాలతో తయారు చేసిన టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ పాలు, డికాషిన్‌ టీ తాగిన తర్వాత చాలా మందికి ఎసిడిటీ సమస్య తలెత్తుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మట్టి కుండలో పాలతో తయారు చేసిన టీ తాగితే ఈ సమస్య దరిచేరదంటున్నారు. దీనిలోని ఆల్కలీన్‌లను మట్టి పాత్ర శుష్కింప చేయడం వల్ల ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుందట. అంతేకాకుండా మట్టి కుండలో టీ తాగడం వల్ల కూడా శరీరానికి పోషకాలు అందుతాయి. ఎందుకంటే మట్టిలో భాస్వరంతోపాటు వివిధ మినరల్స్‌ ఉంటాయి. ఇవి టీతోపాటు లోపలికి వెళ్లి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ఈ రోజుల్లో మట్టి కుండలు ఎక్కడా దొరకడం లేదు. కాబట్టి చాలా దుకాణాలు టీని ప్లాస్టిక్ కంటైనర్లలో విక్రయిస్తున్నాయి. అయితే అందులో ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ కంటైనర్‌లో టీ పోయడం వల్ల రసాయన ప్రతిచర్య ప్రారంభమవుతుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.