Control Blood Pressure: వీటిని తీసుకుంటే ఎంత బీపీ ఉన్నా కంట్రోల్ లోకి వస్తుంది! ఎలా వాడాలంటే!

ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న మరో దీర్ఘకాలిక అనారోగ్య సమస్య రక్త పోటు దీన్నే బీపీ అని కూడా అంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ హైపర్ టెన్షన్ వస్తుంది. చిన్న వయసులో అధిక రక్తపోటుతో చాలా మంది బాధ పడుతున్నారు. ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో ఒత్తిడికి, ఆందోళనకు గురవుతూ ఉంటున్నారు. దీంతో రక్త పోటు అనేది వస్తుంది. బీపీ, షుగర్ అనేవి ఇప్పుడు కామన్ అయ్యాయి. అలాగే మనం తినే ఆహారం వల్ల కూడా రక్త పోటు వస్తుంది. రక్త పోటును గుర్తించడం చాలా కష్టం. ఇది శరీంలో సైలెంట్ కిల్లర్ గా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా ముందుగానే పలు జాగ్రత్తలు..

Control Blood Pressure: వీటిని తీసుకుంటే ఎంత బీపీ ఉన్నా కంట్రోల్ లోకి వస్తుంది! ఎలా వాడాలంటే!
Blood Pressure
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 26, 2023 | 10:55 PM

ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న మరో దీర్ఘకాలిక అనారోగ్య సమస్య రక్త పోటు దీన్నే బీపీ అని కూడా అంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరికీ హైపర్ టెన్షన్ వస్తుంది. చిన్న వయసులో అధిక రక్తపోటుతో చాలా మంది బాధ పడుతున్నారు. ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో ఒత్తిడికి, ఆందోళనకు గురవుతూ ఉంటున్నారు. దీంతో రక్త పోటు అనేది వస్తుంది. బీపీ, షుగర్ అనేవి ఇప్పుడు కామన్ అయ్యాయి. అలాగే మనం తినే ఆహారం వల్ల కూడా రక్త పోటు వస్తుంది. రక్త పోటును గుర్తించడం చాలా కష్టం. ఇది శరీంలో సైలెంట్ కిల్లర్ గా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సమస్య తలెత్తకుండా ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. రక్త పోటుతో బాధ పడేవారు రోజూ ట్యాబ్లెట్లు మింగాల్సిందే. లేదంటే చాలా కష్టం. అలా చికిత్స తీసుకుంటూ మంచి డైట్ ను ఫాలో చేస్తే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. వీటితో పాటు కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల కూడా రక్త పోటును అదుపులో ఉంచుకోవాలి.

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ తో బీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం వంటివి ఉంటాయి. ఇవి బీపీని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుంటే బాడీలో ఉండే సోడియం, వ్యర్థాలు కూడా బయటకు పోతాయి. రోజూ మూడు టేబుల్ స్పూన్లు తీసుకోవడం వల్ల రక్తపోటును కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

దానిమ్మ కాయ జ్యూస్:

దానిమ్మ కాయ జ్యూస్ తాగినా కూడా బీపీని అదుపులో పెట్టుకోవచ్చు. ఈ జ్యూస్ తాగడం వల్ల కేవలం బీపీ మాత్రమే కాకుండా రక్త హీనత, అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. గుండె పని తీరు కూడా మెరుగు పడుతుంది. దానిమ్మ జ్యూస్ రక్త నాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది.

తేనె, నిమ్మకాయ:

ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో తేనె, నిమ్మ రసాన్ని కలుపుకుని తాగడం వల్ల కూడా బీపీని తగ్గించుకోవచ్చు. ఇది ఉదయాన్నే పరగడుపున తాగితే పొట్ట కూడా క్లీన్ అవ్వడమే కాకుండా, బరువు కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఇతర జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే యాక్టీవ్ గా ఉంటారు.

మెంతుల నీళ్లు:

మెంతి నీటిని తీసుకోవడం వల్ల కూడా రక్త పోటను కంట్రోల్ చేయవచ్చు. ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల బీపీ మాత్రమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు.

కొవ్వు లేని పాలు:

కొవ్వు లేని పాలు తాగినా కూడా హైపర్ టెన్సన్ ను అదుపు చేయవచ్చు. ఈ పాలల్లో ఉండే విటమిన్ డీ, కాల్షియం, పొటాషియం 10 శాతం వరకూ రక్త పోటును నియంత్రణ చేస్తుంది. ఇది మాత్రమే కాదు కొవ్వు లేని పాలు తాగడం వల్ల గుండెకు కూడా చాలా మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.