Liver Health Tips: బీట్ రూట్ తో దీన్ని కలిపి జ్యూస్ తాగితే.. కాలేయం యంగ్ గా పని చేస్తుంది!
మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కాలేయం కూడా ఒకటి. కాలేయం చెడిపోయిందంతే ఇక బాడీలో ఏ పార్ట్ కూడా సరిగ్గా పని చేయదు. కాలేయం ఒక్కసారి దెబ్బతిందంటే.. కోలుకోవడం కష్టం. ప్రస్తుత కాలంలో అందర్నీ చుట్టుముడుతున్న రోగాల్లో కాలేయ సమస్యలు కూడా ఒకటి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయం పాడవుతుంది. దీంతో పచ్చ కామెర్లు, కాలేయ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్, హెపాటిక్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. మనం తిన్న ఆహారం జీర్ణం చేయడానికి..
మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కాలేయం కూడా ఒకటి. కాలేయం చెడిపోయిందంతే ఇక బాడీలో ఏ పార్ట్ కూడా సరిగ్గా పని చేయదు. కాలేయం ఒక్కసారి దెబ్బతిందంటే.. కోలుకోవడం కష్టం. ప్రస్తుత కాలంలో అందర్నీ చుట్టుముడుతున్న రోగాల్లో కాలేయ సమస్యలు కూడా ఒకటి. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా కాలేయం పాడవుతుంది. దీంతో పచ్చ కామెర్లు, కాలేయ క్యాన్సర్, లివర్ ఫెయిల్యూర్, హెపాటిక్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయి. మనం తిన్న ఆహారం జీర్ణం చేయడానికి, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడం కాలేయం కీలకంగా పని చేస్తుంది. అలాంటి కాలేయం పాడవ్వకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
వీటికి దూరంగా ఉండాలి:
స్మోకింగ్, మద్య పానంకు దూరంగా ఉండాలి. నాన్-వెజ్ ను కూడా ఎక్కువగా తినకూడదు. దీని వల్ల కాలేయంలో ఫ్యాట్ చేరుతుంది. దీంతో వివిధ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జంక్ ఫుడ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. వ్యాయామం చేస్తూ ఉండాలి.
కాలేయం కాపాడటంలో ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చేసుకుని తాగితే కాలేయం ఎప్పుడూ యంగ్ గా పని చేస్తుంది. ఈ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి రెండే రెండు పదార్థాలు. బీట్ రూట్, క్యారెట్. ఈ రెండూ కలిపిన జ్యూస్ తాగడం వల్ల కాలేయం చక్కగా పని చేస్తుంది. దెబ్బతిన్న కణాలను తిరిగి మెరుగు పరచడంలో చక్కగా పని చేస్తాయి క్యారెట్, బీట్ రూట్.
అంతే కాకుండా ఫ్యాటీ లివర్, లివర్ ఫెయిల్యూర్ నుంచి చక్కగా కాపాడుతుంది. కాలేయ ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా.. జీర్ణ క్రియ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. బరువు తగ్గడంలో కూడా ఈ జ్యూస్ బాగా హెల్ప్ చేస్తుంది. కేవలం కాలేయం పని తీరు మాత్రమే కాదు గుండెకు చాలా మంచిది ఈ జ్యూస్. బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల జుట్టు, స్కిన్ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంతకీ ఈ జ్యూస్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
ఇలా చేయాలి:
ఒక మిక్సీ జార్ లో క్యారెట్, బీట్ రూట్ ముక్కలను సమానంగా తీసుకోవాలి. అందులో చిన్న అల్లం ముక్కు, గుప్పెడు కొత్తిమీర, నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టుకోవాలి. అంతే హెల్దీ బీట్ రూట్, క్యారెట్ జ్యూస్ సిద్ధం. దీన్ని మొదట 20 రోజుల పాటు కంటిన్యూగా తాగాలి. ఆ తర్వాత మరో 20 రోజులు గ్యాప్ ఇస్తూ, మరలా తీసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం కాలేయం ఆరోగ్యంగా పని చేస్తుంది. అంతేకాకుండా ఒక వేళ ఏమైనా సమస్యలు ఉన్నా క్రమంగా తగ్గుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. దీన్ని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.