Flax seeds: అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ముఖ్యంగా వయస్సు తెలియకుండా ఉండేందుకు..

మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు అవిసె గింజలు. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. ఇలా చేస్తే దీనివల్ల చర్మం పై ముడతలు పోతాయి మరియు చర్మం మెరుస్తుంది.

Flax seeds: అవిసె గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. ముఖ్యంగా వయస్సు తెలియకుండా ఉండేందుకు..
Flax Seeds
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2022 | 12:42 PM

Flax Seeds Benefits: అవిసె గింజలు.. వీటి గురించి చాలామందికి పెద్దగా తెలిసి ఉండదు. కానీ వీటి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలసుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు అవిసె గింజలు. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఈ అవిసె గింజలను రోజూ వారి ఆహారంలో తీసుకుంటే.. కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా షాక్‌ అవుతారు.. ఇకపై అస్సలు విడిచిపెట్టారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అవిసె గింజలు రోజూ ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తొలిగిపోతాయి. ఉదరం సమస్యలను నియంత్రిస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ల వాతం నిర్మూలనకు అవిసె గింజలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. అయితే.. వీటిని వేయించి పొడి చేసి ఆహార పదార్ధాలలో కలుపుకొని తినవచ్చు. దీంతోపాటు పొడిని నీటిలో కలుపుకొని తాగవచ్చు.

తామర, సోరియాసిస్ లేదా బొల్లి మరియు ఇతర చర్మ వ్యాధుల తగ్గుదలకు ఉపయోగపడతాయి. పొడి చర్మం కూడా సోరియాసిస్ మరియు తామర వంటి ఇతర చర్మ వ్యాధులకు కారణమవుతుంది. ఇవన్నీఅవిసె గింజల ద్వారా నిరోధించబడతాయి. ఈ అవిసె గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీంతో ఒమేగా-3, యాంటీ ఇన్ఫెమేటరీ స్వభావం ఎక్కువగా ఉంటాయి. వీటిని తీనడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని.. హృదయ సంబంధిత వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

అవిసె గింజల నూనెను చర్మంపై మర్దన చేయవచ్చు లేదా అవిసె గింజలను ప్రతీ రోజూ తినవచ్చు. ఏది చేసినా కూడా ప్రయోజనం కలుగుతుంది. వీటి యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా చర్మానికి చికిత్స చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మ కాన్సర్ ను కూడా నిరోధించడానికి సహాయపడతాయి. రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో అవిసెగింజలు బాగా సహాయపడతాయి. వీటిని తరచు తీసుకుంటే మధుమేహం బారిన త్వరగా పడే అవకాశముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

వయసు వల్ల ముఖంపై వచ్చే ముడతలను తగ్గిస్తుంది. ఒక టీస్పూన్ అవిసె గింజల నూనెకు రెండు టేబుల్ స్పూన్ల ముడి తేనె, ఒక టీస్పూన్ తాజా నిమ్మరసం కలిపి ముఖంపై రోజూ ఉదయాన్నే ఫేస్ ప్యాక్ లాగా వేయాలి. దీనివల్ల చర్మం పై ముడతలు పోతాయి మరియు చర్మం మెరుస్తుంది.

అవిసె గింజలను స్క్రబ్ లా కూడా వాడవచ్చు. అవిసె గింజల పొడిని ఒక టేబుల్ స్పూన్ తేనెలో కలిపి మొహానికి పట్టించి బాగా రుద్ది పదినిమిషాలపాటు వదిలేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మ రంధ్రాలు తెరుచుకొని చర్మం తాజాగా మారుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి