Liver Disease: ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.. జాగ్రత్తలు తీసుకోపోతే అంతే సంగతులు..?

Liver Disease: శరీరంలోని అవయవాలలో లివర్‌ చాలా ముఖ్యమైంది. ఇది దెబ్బతింటే మనిషి ప్రాణాలకే ప్రమాదం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..

Liver Disease: ఈ లక్షణాలు కనిపిస్తే మీ లివర్ ప్రమాదంలో ఉన్నట్లే.. జాగ్రత్తలు తీసుకోపోతే అంతే సంగతులు..?
Liver
Follow us
uppula Raju

|

Updated on: Feb 11, 2022 | 2:12 PM

Liver Disease: శరీరంలోని అవయవాలలో లివర్‌ చాలా ముఖ్యమైంది. ఇది దెబ్బతింటే మనిషి ప్రాణాలకే ప్రమాదం. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాలేయం ఆహారాన్ని జీర్ణం చేయడానికి, టాక్సిన్స్ తొలగించడానికి, శక్తిని నిల్వ చేయడానికి పనిచేస్తుంది. కాలేయంలో కొంత మొత్తంలో కొవ్వు ఉంటుంది. అయితే ఈ పరిమాణం దాటితే కాలేయానికి ముప్పుగా మారుతుంది. నివేదిక ప్రకారం కాలేయంలో కొవ్వు పరిమాణం పెరిగినప్పుడు అది ఫ్యాటీ లివర్ వ్యాధికి గురవుతుంది. ఈ వ్యాధిలో సాధారణంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్. జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని సులభంగా నయం చేయవచ్చు. కానీ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ను నయం చేయడానికి చికిత్స కచ్చితంగా అవసరం.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..

వైద్యుల ప్రకారం శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని గుర్తించి సకాలంలో చికిత్స ప్రారంభిస్తే వ్యాధిని సులభంగా నివారించవచ్చు. పొత్తికడుపు చుట్టూ కొవ్వు చేరడం, ఊబకాయం, అధిక శరీర కొవ్వు స్థాయిలు, అధిక రక్తపోటు, టైప్ -2 మధుమేహం, మొదలైనవి కనిపిస్తే ఫ్యాటి లివర్‌ వ్యాధిగా అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితిలో వైదుడిని సంప్రదిస్తే మంచిది.

ఎలా నిరోధించాలి..?

వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఫ్యాటీ లివర్‌ సమస్య రాకుండా ఉండాలంటే జీవనశైలిలో మార్పులు చేయాలి. అన్నింటిలో మొదటిది, మద్యపానానికి దూరంగా ఉండాలి. తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయం రెండూ దెబ్బతింటాయి. కొవ్వు కాలేయ సమస్యను నివారించడానికి మీరు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీర బరువును తగ్గించుకోవడంపై శ్రద్ధ వహించాలి. ప్రతిరోజూ కనీసం 2 గంటలు కష్టపడి పని చేయాలి. ఆహారంలో తృణధాన్యాల పరిమాణం పెంచాలి.

Viral Photos: ఈ మోడల్‌ అందంలోనే కాదు ఆ విషయంలో కూడా సూపర్..?

White Hair: తెల్ల జుట్టుకి కారణం పోషకాహార లోపం.. డైట్‌లో ఈ ఆహారాలు ఉండాల్సిందే..?

Before Marriage: పెళ్లికి ముందు ఈ 4 టెస్ట్‌లు తప్పనిసరి.. కాబోయే వధూవరులిద్దరికి అవసరం..?

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన