Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spinach Side Effects: పాలకూరతో ఉపయోగాలేమిటి..? ఎవరు తినకూడదు..!

Spinach Side Effects: మనం అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు కొన్ని పద్దతులు పాటిస్తే ఎంతో మంచిది. ఆస్పత్రులకు వెళ్లకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే..

Spinach Side Effects: పాలకూరతో ఉపయోగాలేమిటి..? ఎవరు తినకూడదు..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 11, 2022 | 1:10 PM

Spinach Side Effects: మనం అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు కొన్ని పద్దతులు పాటిస్తే ఎంతో మంచిది. ఆస్పత్రులకు వెళ్లకుండా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ విషయం అందరికి తెలిసిందే. ప్రతి వైద్యులు కూడా ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇక ఆకు కూరల్లో పాలకూర ఒకటి. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆది ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిని ఇతర కూరల్లో జోడించి కూడా వండుకోవచ్చు. పాలకూర తినడం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. ఎందుకంటే ఇందులో కేవలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి సంబంధించి మంచి పోషకాలుంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, విటమిన్‌-ఏ,సి, కె. వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ సూపర్‌ ఫుడ్‌ను ఆహారంలో క్రమం తప్పకుండా చేర్చుకోవడం వల్ల క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా ఉంచుకోవచ్చు. అలాగే బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిని పెంచుతుంది. పాలకూర తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగి ఉన్నందున ఇది మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొందరు తింటే సమస్య ఏర్పడుతుంది.  కొందరు దీనిని తక్కువ తీసుకుంటే మంచిది.

ఎక్కువగా తీసుకుంటే..

ప్రతిరోజూ ఒక చిన్న గిన్నెలో పాలకూర తీసుకోవడం ఆరోగ్యానికి హాని కలిగించదు. ఇందులో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఇతర ఖనిజాలను గ్రహించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఇది శరీరంలో సంభవించే అలెర్జీల నుంచి కాపాడుతుంది. దీనిని మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా తీసుకున్న సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి.

ఎవరు తినొద్దు..

కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారు దీనికి దూరంగా ఉండటం మంచిది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని ఆక్సాలిన్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం నుంచి బయటకు పంపడం కష్టమవుతుంది. మూత్ర పిండాలలో రాళ్లు కావడానికి దారితీస్తుంటుంది. రాళ్ల ప్రమాదం పెంచుతుంది. ఈ ఆకు కూరలో ఆక్సాలిన్‌ యాసిడ్‌తో పాటు ప్యూరిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు సమ్మేళనాలు కలిసి ఒక రకమైన ఆర్థరైటిస్‌ను ప్రేరేపిస్తుంది. ఒక వేళ కీళ్ల నొప్పులు, వాపులు, మంటలతో బాధపడుతున్నట్లయితే అధికంగా తీసుకోకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Amla Benefits: ఉసిరితో బోలెడు ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..!

Diabetes: మధుమేహం వెంటాడుతోందా..? ఈ ఆహార పదార్థాలను తీసుకోండి.. అదుపులో ఉంచుకోవచ్చు

Vitamin-D: మీరు రుచి, వాసన కోల్పోతున్నారా..? ఈ విటమిన్‌ లోపం కావచ్చు.. పరిశోధనలలో కీలక విషయాలు