AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vitamin-D: మీరు రుచి, వాసన కోల్పోతున్నారా..? ఈ విటమిన్‌ లోపం కావచ్చు.. పరిశోధనలలో కీలక విషయాలు

Vitamin-D: మన శరీరానికి డి విటమిన్‌ ఎంతో ముఖ్యం. ఇప్పుడు దేశంలో డి విటమిన్‌ లోపంతో బాధపడుతున్నవారు చాలా మందే ఉన్నారు. మన దేశంలో దాదాపు 90 శాతం..

Vitamin-D: మీరు రుచి, వాసన కోల్పోతున్నారా..? ఈ విటమిన్‌ లోపం కావచ్చు.. పరిశోధనలలో కీలక విషయాలు
Subhash Goud
|

Updated on: Feb 10, 2022 | 11:54 AM

Share

Vitamin-D: మన శరీరానికి డి విటమిన్‌ ఎంతో ముఖ్యం. ఇప్పుడు దేశంలో డి-విటమిన్‌ లోపంతో బాధపడుతున్నవారు చాలా మందే ఉన్నారు. మన దేశంలో దాదాపు 90 శాతం మందికి D-విటమిన్‌ (Vitamin-D) లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న జీవన విధానం, ఉదయం లేవగానే ఉద్యోగం, వ్యాపారాల నిమిత్తం ఉరుకులు పరుగులు, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది D విటమిన్‌ లోపంతో ఇబ్బంది పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మన శరీరంపై సూర్యకిరాణాలు ప్రసరించడం వల్ల చర్మం కింద పొరల్లోని కొవ్వులు కరిగి D విటమిన్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ విటమిన్‌ లోపం కారణంగా గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల సమస్య, రోగ నిరోధక శక్తి కోల్పోవడం తదితర కారణాల వల్ల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

రుచి, వాసన కోల్పోవడం..

అయితే D-విటమిన్‌ తగినంత మోతాదులో లేని కారణంగా మనిషి ఒక వయసు వచ్చాక వాసన, రుచిని కోల్పోవడం జరుగుతుందని పరిశోధకులు అధ్యాయనాల ద్వారా తేల్చారు. అలాగే బలహీన పడిపోవడం వంటివి జరుగుతాయి. విటమిన్‌ డి లోపం అనేది రుచి, వాసన కోల్పోవడం మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. అందుకే డి-విటమిన్‌ కోల్పోయిన వారు రుచి,వాసన కోల్పోతారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలన్ని న్యూట్రియంట్స్‌ జర్నల్‌లో ప్రచురించిన 2020 నాటి అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. ఒక రోజులో తగినంత డి-విటమిన్‌ పొందుతున్న వారితో పోల్చితే విటమిన్‌ లోపించి రుచి, వాసన గుర్తించలేని వారు బలహీనతకు గురయ్యే అవకాశం 39 శాతం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

డి-విటమిన్‌ లేమి కారణంగా..

డి-విటమిన్‌ లేమి కారణంగా అలసట, నొప్పులు, ఒంట్లో నిరసంగా ఉండటం, మజిల్‌ పెయిన్‌, బోన్‌ పెయిన్‌, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది పడటం, కింద కూర్చుని లేచేటప్పుడు ఇబ్బంది పడటం తదితర లక్షణాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.

డి-విటమిన్‌ లోపాన్ని అధిగమించాలంటే..

ఇక డి-విటమిన్‌ లోపాన్ని అధిగమించాలంటే వేసవి కాలంలో 10-20 నిమిషాల పాటు సూర్య కిరణాలను శరీపంపై పడేలా చూసుకోవడం ద్వారా డి-విటమిన్‌ లోపాన్ని అధిగమించవచ్చు. అదే చలికాలంలో రెండు గంటలపాటు సూర్యరశ్మి పడేలా చూసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Heart Problems: ఈ కారణాలతోనే గుండె జబ్బులు అధికం.. తాజా పరిశోధనలో కీలక విషయాలు

Milk Benefits: గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుందా? ఇందులో నిజం ఎంత..?

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే