Milk Benefits: గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుందా? ఇందులో నిజం ఎంత..?

Milk Benefits: చాలా దేశాల్లో రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అలవాటుగా ఉంటుంది. ఇలా గోరువెచ్చని పాలు ఎందుకు తాగుతారో మీరెప్పుడైనా గమనించారా..?..

Milk Benefits: గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుందా? ఇందులో నిజం ఎంత..?
Follow us
Subhash Goud

|

Updated on: Feb 08, 2022 | 6:44 PM

Milk Benefits: చాలా దేశాల్లో రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగడం అలవాటుగా ఉంటుంది. ఇలా గోరువెచ్చని పాలు ఎందుకు తాగుతారో మీరెప్పుడైనా గమనించారా..? ఇది మంచి నిద్రను ఇస్తుందని కొందరంటే, పొట్టను శుభ్రంగా ఉంచుతుందని మరి కొందరు చెబుతుంటారు. అయితే నిద్రకు, పాలకు సంబంధం ఏమిటో తెలుసుకుందాం. రాత్రి సమయంలో నిద్ర బాగా పోయేందుకు గోరువెచ్చని పాలు తాగుతుంటారు. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నిద్రలేమితో బాధపడుతుంటారు. బీబీసీకి చెందిన సైన్స్ ఫోకస్ అనే మ్యాగజైన్ నివేదిక ప్రకారం.. వేడి పాలతో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పాలలో ప్రత్యేకమైన ప్రోటీన్స్‌ ఉంటుంది. దీనిని ఆల్ఫా-లాక్టాల్బుమిన్ అని పిలుస్తారు. ఇది అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ యొక్క మూలం. ఇది శరీరానికి చేరుతుంటుంది. సెరోటోనిన్ అనే న్యూరోట్రాన్స్మిటర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ న్యూరోట్రాన్స్మిటర్ ఒక వ్యక్తి మానసిక స్థితి, నిద్రకు ఉపయోగపడుతుంది. శరీరంలో ఆల్ఫా-లాక్టాల్‌బుమిన్‌కు చేరుకున్న తర్వాత రక్తంలో అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ పరిమాణం పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో రాత్రి సమయంలో సరైన నిద్రపోయేందుకు ఉపయోగపడుతుంది. ఇది కాకుండా ఒత్తిడిని తగ్గించడానికి పాలలో అనేక మూలకాలు కూడా ఉన్నాయి. ఇలా గోరువెచ్చని పాలు తాగడం వల్ల వ్యక్తి మానసికంగా రిలాక్స్ అవుతాడు.

మహిళపై పరిశోధన..

మనిషికి వేడి పాలు ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి నెదర్లాండ్స్‌లోని 15 మంది మహిళలపై పరిశోధన జరిగింది. ఈ మహిళలందరూ నిద్రలేమితో బాధపడుతున్నవారే. పాలు తాగిన తర్వాత వారి నిద్ర మెరుగుపడిందని పరిశోధనలో వెల్లడైంది. పాలలో మెగ్నీషియం, ప్రొటీన్ కెసైన్ హైడ్రోలైజేట్ తగినంతగా ఉన్నప్పుడు నిద్ర మెరుగుపడుతుందని నివేదిక చెబుతోంది.

బరువు పెరగకుండా..

పాలు బరువు పెరగకుండా కూడా ఉపయోగపడతాయని హెల్త్‌లైన్ నివేదిక చెబుతోంది.1800 మంది మహిళలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పాలు తాగే మహిళల్లో ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

Best Fruit Juice: సమ్మర్ సీజన్‌ వచ్చేస్తోంది.. శక్తినిచ్చే పండ్ల రసాలు.. జ్యూస్‌లతో ఎలాంటి ప్రయోజనాలు..?

Health Tips: ఈ ఆహారంతో పెద్దపేగు క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చు.. అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడి