Heart Problems: ఈ కారణాలతోనే గుండె జబ్బులు అధికం.. తాజా పరిశోధనలో కీలక విషయాలు

Heart Problems: రోజురోజుకు మనిషి ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నాడు. అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి తదితర కారణాల వల్ల వ్యాధులు చుట్టుముడుతున్నాయి..

Heart Problems: ఈ కారణాలతోనే గుండె జబ్బులు అధికం.. తాజా పరిశోధనలో కీలక విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 09, 2022 | 9:58 AM

Heart Problems: రోజురోజుకు మనిషి ఎన్నో రకాల వ్యాధులకు గురవుతున్నాడు. అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన, నిద్రలేమి తదితర కారణాల వల్ల వ్యాధులు చుట్టుముడుతున్నాయి. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఎక్కువగా పెరిగినా ప్రమాదమే. ఇక హైబీపీ ఉన్నట్లయితే జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే మున్ముందు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలలో తేలింది. అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీకి చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుండె జబ్బులతో బాధపడుతున్న 36వేల మందిపై శాస్త్రవేత్తలు ఈ పరిశోధణ నిర్వహించారు. యుక్త వయస్సులో ఒత్తిడి, హైబీపీ, కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు వాటిని ఆ వయస్సులో నియంత్రించలేకపోతే భవిష్యత్తులో వారికి మరిన్ని గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అలాగే కేవలం హైబీపీ ఎక్కువగా ఉండే వారికి దాని నియంత్రించకపోతే భవిష్యత్తులో వారి హార్ట్‌ ఫెయిల్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రోజు వ్యాయామం చేయాలంటున్నారు. అలాగే మద్యం, ధూమపానం మానుకొని పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు.

చలికాలంలో జాగ్రత్త..

చలి కాలంతో గుండెకు ఎంతో సంబంధం ఉంది. చలి అంటేనే వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, బయట ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు వ్యక్తి శరీరంలోని రక్తనాళాలు కుచించుకుపోతాయి. దీని వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ‘సింపథటిక్‌ నర్వస్‌ సిస్టమ్‌’ వేగవంతం అవుతుంది. దాంతో గుండె స్పందన పెరుగుతుంది. అంటే, గుండె ఎక్కువసార్లు కొట్టుకుంటుంది. రక్తనాళాలపై ఒత్తిడి అధికమై బీపీ పెరుగుతుంది. ఇవన్నీ కలిసి గుండెపై ప్రభావం చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Wisdom Teeth: జ్ఞాన దంతాల వల్ల మనిషి మేధస్సు, ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందా..? పరిశోధకులు ఏమంటున్నారు?

Milk Benefits: గోరువెచ్చని పాలు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుందా? ఇందులో నిజం ఎంత..?

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్