Kidney Stones: కిడ్నీలో రాళ్లు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే వీటిని తప్పక తినండి.. ఎన్నో బెనెఫిట్స్..
కూరగాయలు.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత పోషక పదార్థాలు. మనం రోజూ తినే కూరగాయల ద్వారా మన శరీరానికి శక్తి వస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ కూరగాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. విరివిగా లభించే...
కూరగాయలు.. ప్రకృతి ప్రసాదించిన అద్భుత పోషక పదార్థాలు. మనం రోజూ తినే కూరగాయల ద్వారా మన శరీరానికి శక్తి వస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ కూరగాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. విరివిగా లభించే మునగకాయలతోనూ మంచి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాంబార్ లో ముక్కలు చేసుకుని యాడ్ చేసుకున్నా, టమాటాతో కూర వండుకున్నా.. మునగ రుచే వేరు. అంతే కాకుండా ఆయుర్వేదంలోనూ మునగ గురించి ప్రస్తావించారు. జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడం, ఎముకలను బలోపేతం చేయడం, రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడం ఇలా చెప్పుకుంటూ పోతే.. లిస్ట్ చాలా పెద్దదే.. మునగ అందించే ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు తప్పనిసరిగా మునగ ఆకులను తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో పోషకాలు చాలా ఉన్నాయి. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే తప్పనిసరిగా మునగ ఆకులను తినాలని సూచిస్తున్నారు నిపుణులు. కిడ్నీలోని రాళ్లను కరిగించి మూత్ర ద్వారా బయటకు వెళ్లేందుకు సహకరిస్తాయి. మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది.
మునగ ఆకుతో చేసిన కూర తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. డయాబెటీస్ సమస్యలు ఉన్నవారికి కూడా మునగ ఆకులు చాలా ఉపయోగకరంగా పరిగణించబడతాయి. దీని ఆకులు యాంటీ డయాబెటిక్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. మనుగ ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం ద్వారా మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం