Mouth Wash: నోటి దుర్వాసన వేధిస్తోందా.. వంటింట్లోని ఈ పదార్థాలతో మౌత్ వాష్ తయారు చేసుకోండిలా..

శరీరంలో నోరు అతిముఖ్యమైన భాగం. నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని మనందరికీ తెలిసిందే. ప్రతి రోజూ రెండు సార్లు పళ్లు తోముకోవాలి. అయితే మనలో చాలా మంది దంతాలు, చిగుళ్ల శుభ్రత కోసం ఖరీదైన డెంటల్...

Mouth Wash: నోటి దుర్వాసన వేధిస్తోందా.. వంటింట్లోని ఈ పదార్థాలతో మౌత్ వాష్ తయారు చేసుకోండిలా..
Mouth Smell
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 01, 2023 | 7:37 AM

శరీరంలో నోరు అతిముఖ్యమైన భాగం. నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని మనందరికీ తెలిసిందే. ప్రతి రోజూ రెండు సార్లు పళ్లు తోముకోవాలి. అయితే మనలో చాలా మంది దంతాలు, చిగుళ్ల శుభ్రత కోసం ఖరీదైన డెంటల్ కేర్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. కానీ మౌత్ వాష్ లేకుండా నోటి సంరక్షణ అసంపూర్తిగా ఉంటుంది. నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇంట్లో ఉన్న వంట పదార్థాలు, దినుసులతో పదార్థాలను తయారు చేసుకోవడం మంచిది. తద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉప్పు ఉత్తమ సహజ నివారణగా నిరూపిస్తుంది. ఉప్పునీటిని నోటిలో వేసుకుని పుకిలించడం, బ్రష్ చేసిన తర్వాత ఉప్పు నీటిని నోట్లో వేసుకుని మౌత్ వాష్ చేయాలి. ఇలా చేస్తే నోట్లో ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియా ఉప్పులోని లవణాల గాఢతకు చనిపోతుంది. కలబంద ఔషధ గుణాలతో నిండి ఉంది. ఇది నోటిని బ్యాక్టీరియా రహితంగా ఉంచడంలో సహాయపడుతుంది. కలబందను మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం తగ్గుతుంది. ఈ మౌత్ వాష్ చేయడానికి, అర గ్లాసు అలోవెరా జ్యూస్‌ని అర గ్లాసు నీటిలో కలపాలి. బ్రష్ చేసిన తర్వాత ఈ నీటిని రెండు మూడు సార్లు నోట్లో పోసుకుని పుక్కిలించాలి.

టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తీసుకున్న తర్వాత దంతాల పై గార ఏర్పడుతుంది. అలాంటప్పుడు బేకింగ్ సోడాను మౌత్ వాష్ ఉపయోగించడం మంచిది. ఇది నోటి నుంచి బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. అర టీస్పూన్ బేకింగ్ సోడాను గోరువెచ్చని నీటిలో కలపాలి. అది పూర్తిగా కరిగిపోయే వరకు కలిపి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించాలి. కొబ్బరి నూనెతో కూడా మౌత్ వాష్ వాటర్ తయారు చేసుకోవచ్చు. ఈ వాటర్ దంతాలను తెల్లగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా సూక్ష్మక్రిములు లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడానికి వేలితో కొబ్బరి నూనెను తీసుకుని దంతాలు, చిగుళ్లపై రాయాలి. 5 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. ఇది మీ దంతాలను బలంగా చేస్తుంది.

మౌత్ వాష్ చేయడానికి ఎసెన్షియల్ ఆయిల్ ను ఉపయోగించవచ్చు. ఇది నోటి సంరక్షణకు ప్రభావవంతంగా పని చేస్తుంది. దీని కోసం కొన్ని చుక్కల లవంగం, దాల్చిన చెక్క నూనెను నీటిలో కలపాలి. రోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత, రాత్రి నిద్రపోయేటప్పుడు మౌత్ వాష్‌తో మీ దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇది నోటి నుంచి దుర్వాసనను తొలగిస్తుంది.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.