AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Grapes Health: ద్రాక్ష గింజలను పడేస్తున్నారా.. పొట్టుతో సహా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే..

ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఆహార పదార్థాల్లో ద్రాక్ష పండ్లు ఒకటి. మార్కెట్‌లో ప్రస్తుతం వివిధ రకాల ద్రాక్ష పండ్లు అందుబాటులో ఉన్నాయి. రంగులోనే కాకుండా రుచిలోనూ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. తీపి, పుల్లని రుచి..

Grapes Health: ద్రాక్ష గింజలను పడేస్తున్నారా.. పొట్టుతో సహా తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటంటే..
Grapes
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 12, 2022 | 6:17 AM

ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఆహార పదార్థాల్లో ద్రాక్ష పండ్లు ఒకటి. మార్కెట్‌లో ప్రస్తుతం వివిధ రకాల ద్రాక్ష పండ్లు అందుబాటులో ఉన్నాయి. రంగులోనే కాకుండా రుచిలోనూ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. తీపి, పుల్లని రుచి కలిగిన ద్రాక్షను తినేందుకూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు. అంతే కాకుండా ద్రాక్ష పండ్లను వైన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ద్రాక్ష లో ఉండే విటమిన్లు, ప్రొటీన్లు, పోషక పదార్థాలు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కొందరు ద్రాక్షను తొక్కలతో సహా తింటే మరికొందరు మాత్రం ద్రాక్ష లోని గుజ్జును తింటారు. ద్రాక్ష గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అనేక వ్యాధుల నుంచి నివారిస్తుంది. ద్రాక్ష గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన రక్తపోటును నిర్వహించడానికి సహాయపడతాయి. రక్తనాళాల్లో సరైన రక్త ప్రసరణకు కారణమవుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మెదడులో ప్రోటీన్ ఏర్పడటం వల్ల వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి రక్షించే సామర్థ్యం దీనికి ఉంది. వీటిలో యాంటీఆక్సిడెంట్లే కాకుండా విటమిన్ ఈ, లినోలెనిక్ యాసిడ్, ఫినోలిక్ సమ్మేళనాలు, పొటాషియం, కాపర్, ఫాస్పరస్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, ఐరన్ ఉన్నాయి. అంతే కాకుండా, ద్రాక్ష గుజ్జులో ప్రోటీన్, ఫైబర్, నీరు అధికంగా ఉంటుంది. ద్రాక్ష గింజలు కళ్లకు కూడా మేలు చేస్తాయి. ద్రాక్ష గుజ్జును తీసుకోవడం కంటి రక్షణకు మంచిదని ఆరోగ్య రంగ నిపుణులు చెబుతున్నారు. గుజ్జు లేకుండా ద్రాక్ష తినడం కంటికి మంచిది. ఇది రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, కళ్ల దృష్టిని కాపాడుతుంది. యూవీ కిరణాల నుంచి కళ్లను రక్షిస్తాయి. కాబట్టి పొట్టు, గింజలతో సహా ద్రాక్షను తినడం మంచిది.

ద్రాక్షలో మినరల్స్, న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కె ఎముకల సమస్యలను తగ్గిస్తుంది. ద్రాక్ష పండు ఫంగల్ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఫుడ్ పాయిజనింగ్‌ను నివారిస్తుంది. చర్మం యవ్వనంగా ఉండేందుకు ద్రాక్షపండ్లను తినడం ఎల్లప్పుడూ మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.